సమంత అంటే పడి చచ్చిపోయే జనాలు ఎంతమంది ఉన్నారో ..సమంత అంటే కోపంతో ఊగిపోయే జనాలు కూడా అంతేమంది ఉన్నారు. హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది. ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సమంత కుర్రాళ్లను ఏం మాయ చేసిందో తెలియదు కానీ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ కి మించిపోయే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. బడాబడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది.
ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత ఆయనకు విడాకులు కూడా ఇచ్చేసింది . అయితే సమంత తన కెరీర్ లో చేసిన ఒక తప్పు ఆమె లైఫ్ ఫెయిల్ అయ్యేలా చేసింది అంటున్నారు అభిమానులు. సమంతతో పాటు స్టార్ హీరోయిన్గా ఉన్న కాజల్ అగర్వాల్ తన లైఫ్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంది అని .. ప్రేమించి పెళ్లి చేసుకుని వెంటనే ఒక బిడ్డకు జన్మనిచ్చేసింది అని .. ఆ కారణంగానే గౌతమ్ కిచ్చులు కాజల్ అగర్వాల్ వైవాహిక జీవితం చాలా సాఫీగా ముందుకు సాగింది అని..
సమంత కూడా అలాగే సినిమా అవకాశాలు అనుకోకుండా పెళ్లయిన ఏడాదికి ఒక పాపకు బాబుకో జన్మనిచ్చుంటే ఖచ్చితంగా ఆమె కూడా ఇప్పుడు బిడ్డలతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసి ఉండేది అని.. సినిమా అవకాశాల కోసం ఆమె తన లైఫ్ని నాశనం చేసుకుంది అని ..ఇప్పుడు సినిమా అవకాశాలు లేక అటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వదిలేసి అటు ఇటు కాని పొజిషన్లో ఉంది అని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేస్తున్న సమంత సక్సెస్ అందుకుంటుంది అనే నమ్మకాలు ఎవ్వరికి లేవు..!!