దారుణంగా ఓడిపోయిన జగన్..”ఎత్తండి రా తల “అంటూ శ్రీరెడ్డి సెన్సేషనల్ పోస్ట్..!

శ్రీ రెడ్డి .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే . కాగా సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ గా పలు కామెంట్స్ చేసి జనాలు చేత తిట్టించుకున్న శ్రీరెడ్డి .. ఆ తర్వాత తన రూటే సపరేటు అంటూ తనదైన స్టైల్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే శ్రీ రెడ్డి ఈ మధ్యకాలంలో జనాలు చేత పాజిటివ్ కామెంట్స్ కూడా దక్కించుకుంటూ వచ్చింది .

వైయస్ జగన్ ..వైసిపి పార్టీకి బాగా సపోర్ట్ చేసే శ్రీ రెడ్డి వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ కూడా ఉంటుంది శ్రీ రెడ్డి అన్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్గా జరిగినటువంటి 24 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం దారుణాతి దారుణంగా పడిపోయింది ..ఓడిపోయింది .. 175 సీట్లకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడం భారీ షాక్ ఇచ్చింది .

ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఓటమిపాలు అవ్వడం పట్ల శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టింది. ” అరణ్యం పాలైన అర్జునుడు తిరిగి రాజ్యాన్ని చేపట్టినట్లు .. పట్టుదల వదలకుండా తన రాజకీయాన్ని జగన్ చాకచక్యంగా కొనసాగిస్తాడు .. ఆయనకు సైన్యంలా మేమంతా తోడుగా ఉంటాం.. ఎవరు కూడా బాధపడకండి .. ఎత్తండి రా తల ఎగురయిరా కాలర్ .. ఏ ప్రభుత్వం ఇవ్వలేని పథకాలు మన జగన్ ప్రభుత్వం అందించింది ధైర్యంగా నిలబడండి .. జగనన్న తాలూకా అని చెప్పండి” అంటూ ట్వీట్ చేసింది . ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది…!!