పవన్ కళ్యాణ్ గెలుపుతో త్రివిక్రమ్ సెన్సేషనల్ డెసిషన్… ఇది కదా రా ఫ్రెండ్షిప్ అంటే..!

ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా హీరోలు వేస్ట్ అని చెప్పాలి . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో రాజకీయాలలో ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనం చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ భారీ భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఆయన గెలుపు కోసం మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురం వచ్చి ప్రచారం చేసిన విషయం తెలిసిందే .

నాగబాబు ..నాగబాబు భార్య.. నాగబాబు కొడుకు సాయిధర్మతేజ్.. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందరూ కూడా పిఠాపురం చేరుకొని ప్రచారం చేశారు . ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గెలుపుకు కారణమయ్యారు . కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కూడా పవన్ కళ్యాణ్ గెలుపుకి చాలా చాలా కష్టపడ్డారు . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ భారీ ఓట్ల మెజారిటీతో గెలవడంతో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్నారట.

త్రివిక్రమ్ దీనికి ప్లానింగ్ చేస్తున్నారట. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలోకి ఎలా వచ్చాడు . ఇండస్ట్రీ అంటే ఇష్టం లేని పవన్ కళ్యాణ్ ఎలా సినిమాలో నటించాడు..? హిట్స్ అందుకున్నాడు ..? పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ..?అసలు పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ..? అనే విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!