ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల స్థానాలు ఎప్పటికీ కాన్ఫిడెంట్గా ఒకే పొజిషన్లో ఉంటాయి అని చెప్పలేం . ఈరోజు స్టార్ అయిన వాళ్ళు రేపటి రోజు జీరో అవ్వచ్చు.. రేపటి రోజు జీరో గా ఉన్నవాళ్లు పక్క రోజు స్టార్ అవ్వచ్చు.. అలాంటి సందర్భాలు మనం ఎన్నో ఎన్నో చూసాము.. కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వాళ్ళు అందరూ త్వరలోనే ఫేడ్ అవుట్ అవ్వబోతున్నారు అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఉన్న రష్మిక మందన్నా.. అదే విధంగా కీర్తి సురేష్ – తమన్నా – శ్రీ లీలల టైం అసలు బాగోలేదు అని…
ఆ బ్యూటీస్ ని మించిపోయే రేంజ్ లో ఉండే బ్యూటీస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో వీళ్ళ స్థానాలు డమ్మీలుగా మారబోతున్నాయి అని ప్రచారం జరుగుతుంది . ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ అంటే రష్మిక మందన్నా ఆమె తర్వాతే ఎవరైనా .. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ – తమన్నా ఓ రేంజ్ లో అల్లాడించేస్తున్నారు . అయితే ఇప్పుడు రష్మిక – శ్రీ లీల – కీర్తి సురేష్ – తమన్నా ప్లేసులను రీప్లేస్ చేసే హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటూ తెగ ప్రచారం జరుగుతుంది .
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే తృప్తి దిమ్రి పేరు మారుమ్రోగిపోతుంది . యానిమల్ సినిమాతో ఈ ఘనత అందుకుంది ఈ బ్యూటీ. అంతేకాదు మృణాల్ ఠాకూర్ పేరు కూడా బాగా హైలైట్ గా వినిపిస్తుంది. అంతేనా జాన్వి కపూర్ కూడా బాగా ఆఫర్స్ అందుకుంటుంది . త్వరలోనే ఆ టాప్ హీరోయిన్స్ ప్లేసెస్ ని ఈ అందాల ముద్దుగుమ్మలు రీప్లేస్ చేయబోతున్నారు అని .. సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . మరి ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఎలా తట్టుకుంటారో చూద్దాం..!?