తరచు అగరబత్తీలు వాడుతున్నారా.. ఇది ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు..?!

భారతీయ సాంప్రదాయంలో అగర్బత్తులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. దైవ అనుగ్ర‌హం పొందాలంటే ధూపం సమర్పించటం పురాణాల నుంచి వస్తున్న ఆచారం. వేల సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే అగర్బత్తీలు అధికంగా వాడడం క్యాన్సర్ కు దారితీస్తుందని తాజా అధ్యయనాలు నిరూపించాయి. ధూపం కాల్చినపుడు వెలువడ కెమికల్స్ శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తాయట. ఇంతకీ అగర్బత్తుల వల్ల ఎలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి.. ధూప్ స్టిక్స్ ఎందుకు ప్రమాదం ఒకసారి చూద్దాం. సాధార‌ణంగా అగర్బత్తుల పరిశ్రమల వారికి ధూపం కర్రల కూర్పు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.

సహజమైన లేదా సేంద్రియ రూపంలో కర్రలను తాజా ఆవుపేడ, బొగ్గు, ఎండిన మూలికలు, పువ్వులు నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది గంధపు చెక్క, గులాబీ రేకుల వాసన, లావెండర్, రోస్ మేరీ ఇలా రకరకాల సుగంధ వాసనలు వెదజల్లుతూ ఉంటాయి. నెయ్యి లేదా బెల్లం సహజ బైండింగ్ ఏజెంట్లుగా తోడ్పడతాయి. వెదురు స్కేవర్లను ధూప్ స్టిక్స్ బేస్డ్ గా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సహజమైన ధూప ద్రవ్యాలు.. మృదువైన, సున్నితమైన సువాసనను వెదజల్లుతాయి. అయితే ఈ అగర్బత్తులు మార్కెట్లో అధిక డిమాండ్ పెరగడంతో.. దీర్ఘకాలం నిలువ ఉండేలా.. విరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి కంపెనీలు సింథటిక్ అగర్బత్తీలు తయారీని మొదలుపెట్టారు.

ఇవే సాధారణంగా వేస్ట్ వుడ్, ప్లైవుడ్ పౌడర్, సడస్ట్ లేదా రంగుల పొడుల నుంచి తయారు చేస్తున్నారు. శక్తివంతమైన జిగురునో బైండర్ గా సిందటిక్స్ వాసన గల నూనెలను మంచి వాసనల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలను పలచన చేయడానికి ప్ర‌మాద‌క‌ర‌ ఎక్స్టెండర్లను తరచుగా వాడుతున్నారు. సింథటిక్ అగరబతులను కాల్చడం వల్ల నలుసు పదార్థాలు ఏరోసోల్స్, ఆస్థిర కార్బన్ సమ్మేళనాలు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్డయాక్సైడ్, పోలి రొమాంటిక్ హైడ్రో కార్బన్లు, టోల్ అండ్ కార్సోనిల్స్, బెంజిన్, ఆల్కహుడ్లు ఇలా హానికర పదార్థాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. దీంతో అగరబత్తులు చాలాసేపు కాల్చడం వల్ల కళ్ళల్లో నీరు కారడం, అలర్జిటిక్ డెర్మటైటిస్, క్యాన్సర్ లాంటి ప్రమాదకర సమస్యలు తలుతుతాయని నిపుణులు చెప్తున్నారు.