ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలు గా మారినా ఎంతో మంది రియల్ లైఫ్ లోను గొప్ప పనులు చేస్తూ ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. రియల్ స్టార్ గా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటూ ఉంటారు. అలాంటి రియల్ స్టార్స్‌లో సీనియర్ నటి శ్రీవిద్య ఒకరు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తన ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండాలని 14 ఏళ్ల వయసులోనే సినీ ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో పేదరాశి పెద్దమ్మ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని వరుస సినిమాల్లో చేస్తూ స్టార్ హీరోయిన్గా మారింది. ఇక ఈ నటి తన జీవితాన్ని ఎంతో అందంగా మలుచుకోవాలని తెగ ఆరాటపడ్డారు. తను జన్మించిన కొన్ని రోజులకే తండ్రి చనిపోవడం.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ అమ్మడు.. అదే సమయంలో స్టార్ హీరోని ప్రేమించి ఆయన్ని సర్వస్వంగా భావించిందట. కానీ వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆమె ఆ హీరోకు దూరం కావలసి వచ్చింది. తర్వాత ఆమె ఓ డైరెక్టర్‌ను వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.
కానీ మళ్ళీ ఊహించిన విధంగా కష్టాలు చుట్టుముట్టడంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వాళ్ళ సినిమాల్లో నటించింది. తర్వాత తన భర్తతో విడాకులు తీసుకుని విడిపోయిన ఈ అమ్మడు వీటన్నింటినీ తట్టుకొని కూడా స్ట్రాంగ్ గా నిలబడ కలిగింది. అయితే భగవంతుడు మరింత పెద్ద పరీక్ష పెట్టాడు. క్యాన్సర్ వ్యాధి ఆమెను చుట్టుముట్టింది. దీంతో మూడు సంవత్సరాలు పాటు క్యాన్సర్ తో పోరాడిన శ్రీవిద్య బతుకుతానో లేదో తెలియని పరిస్థితుల్లో తన పేరుపై ఉన్న కోట్ల ఆస్తిని పేద పిల్లల చదువుకోసం రాసిచ్చింది. తర్వాత ఆమె తుది శ్వాస విడిచింది. అయితే ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది.