ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ వాడని వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీకు ఈ గుడ్ న్యూస్‌ను గూగుల్ తన కొత్త అప్డేట్లతో వివరించింది. ఆ అప్డేట్ ల ద్వారా యూసర్లకు ఏడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో మొదటి ఫీచర్ మన ఏదైనా మెసేజ్ చేసిన తర్వాత దాన్ని ఈజీగా తొలగించవచ్చు.. అలాగే ఆ మెసేజ్ సెండ్ చేసిన 15 నిమిషాల వరకు దానిని ఎడిట్ చేసుకునే ఆప్షన్ను ఈ ఫీచర్ అందించింది.
రెండో ఫీచర్ ఒకే ట్యాబ్ లో దేనినైనా కనెక్ట్ చేసుకునేలా ఆఫర్ అందించింది. అయితే కనెక్ట్ చేసిన పరికరాన్ని మార్చుకునే ఆప్షన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. మూడో ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లను వాడేవారు ఫోన్ హోం స్క్రీన్ లో ఉపయోగించే స్టార్ యాప్స్ సులభంగా మేనేజ్ చేసేలా డిజైన్ చేసింది. అలాగే నాలుగో ఫీచర్‌తో.. ఫోన్ నుంచి మీ కారుని కూడా మీరు నియంత్రించగలిగేలా.. ఫోనే కార్‌కి ఇలా పనిచేసేలా అప్డేట్లు క్రియేట్ చేసింది. ఆప్షన్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుందట.
ఈ ఫీచర్లో వినియోగదారులు కారును అన్లాక్ చేస్తే ఆప్షన్ కూడా పొందుతారు. అలాగే మరో ఫీచర్ మనకు ఇష్టం వచ్చినట్లుగా కొత్త ఎమోజిని డిజైన్ చేసుకొని సందేశాన్ని పంపవచ్చు. దానితో పాటు రెండు ఇమాజీలను కలపడం ద్వారా కొత్త ఇమేజిని కూడా సృష్టించే ఆప్షను క్రియేట్ చేసింది. మరో ఆప్షన్ను మీరు అప్డేట్ చేసుకోవడం ద్వారా గూగుల్ వాలెట్లు పొందవచ్చు. ఈ యాప్ వేర్ ఓఎస్ పవర్ స్మార్ట్ వాచ్ లో భాగంగా ఉంది. దీని సహాయంతో పేమెంట్స్ సులభంగా చేయవచ్చు. ఏడో ఫీచర్ సహాయంతో స్మార్ట్ వాచ్ ద్వారా కూడా స్మార్ట్ హోం పరికరాలను నియంత్రించవచ్చు.