వాట్.. బంధువుల విషయంలో ఎన్టీఆర్ కి అలాంటి అభిప్రాయం ఉందా.. అదేంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..?!

జూనియర్ ఎన్టీఆర్ లైఫ్‌లో ఎదుర్కొన్న ఓడిదొడుకుల గురించి దాదాపు అందరికి తెలుసు. నందమూరి ఇంటి వారసుడిగా పుట్టిన తార‌క్‌.. చిన్నతనంలోనే కుటుంబం నుంచి ప్రేమలు, అనుబంధాలకు దూరమై ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తల్లిని మిగతా వారంతా దూషిస్తున్నా.. తనను ఎవరూ దగ్గరకు తీయకున్నా వారి నుంచి ప్రేమనే ఆశించాడు. తాను ఎప్పటికైనా నందమారి కుటుంబ వారసుడిన‌ని చెప్పుకునే ప్రయత్నాలు చేశాడు. ఎంతో పట్టుదలతో శ్రమించి స్టార్ గా ఎదిగిన తార‌క్.. ఇండస్ట్రీలో తండ్రి తప్ప మరొక సపోర్ట్ లేకుండా ఎంట్రీ ఇచ్చినా.. ఈరోజు స్టార్ హీరోగా మారి.. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని దక్కించుకున్నాడు.

Here's how man of masses Jr NTR's mother ignited his passion for Indian  classical dance | Telugu Movie News - Times of India

మా ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకునే రేంజ్ కు ఎదిగాడు. అయితే నంద‌మూరి కుటుంబంలో ఎప్పుడు శాలిని అన్నా, తారక్ అన్నా చిన్నచూపు ఉండేదన్న సంగతి తెలిసిందే. అయితే వారి విషయంలో ఎప్పుడు తారక్ కాస్త కూడా కోపాన్ని చూపించలేదు. అలా ఎలా సాధ్యం అనే ప్రశ్నకు తారక్ ఓ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాడు. తన బంధువులపై తనకు అభిమానాన్ని వివరించాడు. అది నా కుటుంబం. నేను నందమూరి ఇంటి వారసుడిని. నా తండ్రి హరికృష్ణ.. మిగతా వారంతా ఆయన తోబుట్టువులు.. కొన్ని కారణాలతో వారికి ఇబ్బంది కలగవచ్చు.

కానీ మాకు వారంటే చాలా ఇష్టం. ఎవరికి నాపై ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. నాకు వాళ్లంటే మంచి అభిప్రాయమే ఉంటుంది. వారిని నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తా, గౌరవిస్తా. వాళ్లలో నాలో ఒకటే రక్తం ఉంది. నన్ను ఇప్పుడు వాళ్లంతా వారి బిడ్డగా యాక్సెప్ట్ చేశారు. నందమూరి బిడ్డ‌గా ఈ ప్రపంచం కూడా అంగీకరించింది. వీటి ముందు ఒకప్పుడు వాళ్ళు చూపించిన కోపం లెక్క కాదు. నా తోబుట్టువులు కూడా ఇప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నారు. శత్రువులను కూడా ప్రేమించాలనేది మా తాత నుంచి నేర్చుకున్న ఫార్ములా. నేను దాన్నే పాటిస్తా అంటూ తారక్‌ వివరించాడు. ఇలా తన కుటుంబంపై తారక్ ప్రేమను, అభిమానాన్ని వ్యక్తపరిచిన విధానం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అది మా తారక్ అన్న మంచి మనసు అంటూ కామెంట్లు చేస్తున్నారు.