ఎవరో అక్కడికి వెళ్తే నాకేంటి సంబంధం.. రేవ్ పార్టీ ఇష్యూ పై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్..?!

మంచు లక్ష్మి, అజయ్, వేదిక ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ యక్షిని. ఈ వెబ్ సిరీస్ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ను ఇటీవల గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేశారు మేక‌ర్స్‌. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు లక్ష్మి మాట్లాడుతూ ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు ఇంట్ర‌స్టింగ్ స‌మాధానాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూ.. తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Yakshini OTT Release Date, Platform & Time: Lakshmi Manchu & Vedhika's  Horror Series To Stream From THIS Date - Filmibeat

ఇక ఈ ట్రైలర్ లంచ్ ఈవెంట్లో మంచి లక్ష్మికి రేవ్‌ పార్టీ గురించి కూడా కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ఈవెంట్‌లో విలేకరులు తనని రేవ్ పార్టీ గురించి ప్రశ్నించగా ఈ ప్రశ్నలపై ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతం రేవ్ పార్టీ గురించి మాట్లాడడానికి సరైన టైమ్ ఇది కాదు.. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు.. నేను మాత్రం ప్రస్తుతం నా సిరీస్ గురించి ఆలోచిస్తున్నా అంటూ వివరించింది. నేను నటించిన సిరీస్ గురించి ప్రశ్నించండి అంటూ చెప్ప‌కొచ్చింది. ఎవరో ఎక్కడికో వెళ్తే నాకేం సంబంధం.. ఆ వ్యక్తులు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతే అంటూ ఆమె స్పందించింది.

రేవ్‌ పార్టీ గురించి మాట్లాడుతూ మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే బెంగళూరులోని ఒక ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎంతోమంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న నటి హేమ ఈ పార్టీలో పాల్గొన్నారు అంటూ బెంగళూరు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈమెతో పాటు.. మరి కొంత మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటూ న్యూస్ వైరల్ అవ్వడంతో.. ఈ రేవ్ పార్టీ ఇష్యూ సంచలనంగా మారింది.