ప్రభాస్ పైనుంచి బస్సు వెళ్ళింది.. షాకింగ్ విషయాలను రివీల్ చేసిన హీరోయిన్..?!

టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా క్రేజ్‌ సంపాదించుకోవాలంటే కేవలం ఒక్క జోన‌ర్‌ మాత్రమే కాదు.. అన్ని జానర్లలో సినిమాలో న‌టించి సక్సెస్ సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో యాక్షన్స్ సన్నివేశాలు, స్టాంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సినిమాల్లో ఫైట్ సీన్స్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఫైట్ సీన్స్‌ చూడడానికి ఎలా ఉన్నా.. షూటింగ్ టైంలో మాత్రం వారు పడే కష్టం సాధారణంగా ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరో ఫైట్ సీన్స్ అయితే అందులో ఉండే ఎలివేషన్లు భారీ రేంజ్ లో ఉంటాయి. యాక్షన్స్ సీన్స్ లో నటించేటప్పుడు కొన్ని కొన్ని సార్లు వారు కూడా గాయపడుతూ ఉంటారు. కానీ ఒకసారి మాత్రం ప్రభాస్ షూటింగ్ సెట్లో ఉన్నప్పుడు ఆయనకు జరిగిన ప్రమాదానికి సెట్ మొత్తం భయపడిపోయారట.

rspnetwork.in: Sanjana Galrani

అది ఎప్పుడో కాదు.. బుజ్జిగాడు సినిమా షూటింగ్ టైంలో అంటూ వివరించింది ఆ మూవీ సెకండ్ హీరోయిన్ సంజన గల్రాని. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజనా మాట్లాడుతూ.. బుజ్జిగాడు షూటింగ్ టైంలో ప్రభాస్ కు ప్రమాదం జరిగిందని.. ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో నేను స్పాట్‌లో లేనని.. అయితే అది విన్న వెంటనే నేను పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్లాలని.. నేను మాత్రమే కాదు సెట్ లో వాళ్లంతా వారి పనులు ఆపేసి అక్కడకు వెళ్ళామని.. ఏదో టేక్ టైం లో ప్రభాస్ గారు కింద పడిపోయారు.. అప్పుడు ఓ బస్సు ఆయన పైనుంచి వెళ్ళిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. బస్సు మనకి తగలకున్న దగ్గరనుంచి వెళ్తేనే మనం చాలా టెన్షన్ పడ‌తాం. కానీ ప్రభాస్ గారు మాత్రం ఆయన పైనుంచి బస్సు వెళ్ళిన ఏమాత్రం కంగారు పడలేదంటూ వివ‌రించింది.

Prabhas and Sanjana courting friendship? | cinejosh.com

ఎవరిని టెన్షన్ పెట్టలేదు. అందరూ వచ్చి అడుగుతుంటే బాగానే ఉన్నా అంటూ కూల్ గా సమాధానం చెప్పారు.. నిజంగా ఆయన ఓ రియల్ లైఫ్ హీరో అంటూ వివరించింది. చాలా మందికి సెట్స్ లో యాక్షన్స్ సన్నివేశాల సమయంలో.. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది హీరోలు ఇలాంటి యాక్షన్ సీన్స్‌లో నటిస్తూ దెబ్బలు తిని సర్జరీలు కూడా చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తు ప్రభాస్‌కు ఆ రోజు ఏమి గాయాలు కాలేదని సంజన వివరించింది. అయితే ప్రస్తుతం సంజన చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవ్వడంతో.. వాట్ బుజ్జి గాడు టైంలో ఏకంగా ప్రభాస్ పైనుంచి బస్సు వెళ్ళిందా.. అయినా ఏమీ కాలేదా నిజంగా ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉందే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.