ఆ పని చేస్తే నెం 1 హీరోయిన్ అయిపోతారా..? వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ న్యూస్..!

చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్స్పోజింగ్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అయిపోతారు అని.. అది తప్పు అని ప్రూవ్ చేశారు చాలా చాలా మంది బ్యూటీస్. అయితే ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్నారు . రీసెంట్గా ప్రముఖ మీడియా సంస్థ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ ఎవరు అనే విషయంపై సర్వే చేసింది . ఆ సర్వేలో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి . ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురైయ్యే హీరోయిన్ సమంత నెంబర్ వన్ స్థానాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చింది. నిజానికి విడాకుల తర్వాత సమంత హిట్ కొట్టిన మూమెంట్ లేదు .. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు.

కానీ ఆమె నెంబర్ వన్ హీరోయిన్ స్థానం ని అలాగే దక్కించుకునింది . ఆ తర్వాతి స్థానంలో ఎవరు ఊహించని విధంగా స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ నిలవడం గమనార్హం. నిజానికి కాజల్ అగర్వాల్ పెళ్లి అయిపోయింది కొడుకు కూడా పుట్టేశాడు.. ఫిజిక్ కూడా అంత హాట్ గా ఉండదు . కానీ కాజల్ సెకండ్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో అనుష్క శెట్టి నిలిచింది . అనుష్క సినిమాల కెరియర్ ఎలా ఉందో మనకు తెలిసిందే.

అయితే ఆ తర్వాత స్థానంలో శ్రీ లీల – సాయి పల్లవి రష్మిక మందన్నా- తమన్నా నిలవడం గమనార్హం. హైలెట్ విషయం ఏమిటంటే ఎటువంటి ఎక్స్పోజింగ్ అయినా చేస్తామన్న హీరోయిన్స్ .. టాప్ ఫోర్ తర్వాత మాత్రమే ఉన్నారు. అయితే పద్ధతిగా నటించే హీరోయిన్స్ మాత్రం టాప్ త్రీ లో ఉన్నారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ చేస్తే నెంబర్ వన్ హీరోయిన్ అవుతారు అన్న నమ్మకాలు పెట్టుకోకండి అంటున్నారు . అంతేకాదు టిల్లు స్క్వేర్ సినిమాలో విచ్చలవిడిగా రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరణ్.. పదవ స్థానంలో నిలవడం గమనార్హం . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది..!!