టాలీవుడ్ లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి స్నీగ్ద. అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం, దమ్ము, కళ్యాణ వైభోగమే ఇలా దాదాపు 25 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. అయతే ఆడపిల్ల అయినా ఈ అమ్మడూ మగరాయుడి గెటప్‌లో కామెడీ పండిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. అయితే సినిమాల్లోనే కాదు స్నిగ్ధ బయట కూడా మొగరాయుడిలా ఉండటానికే ఇష్టపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ విషయంలో అయినా సరే ఆమె డేర్ గా ముందడుగు వేస్తుంది. వాస్తవంగా స్నిగ్ధ శివ భక్తురాలు. ప్రతి సంవత్సరం శివమాల ధరిస్తానని.. ఆమె గతంలో కూడా పలు వేదికలపై వివరించింది.
ఇక మొదట ఓ ప్రోగ్రాంలో స్నిగ్దను చూసిన మూవీ డైరెక్టర్ నందిని రెడ్డి.. ఆమెకు అలా మొదలైంది సినిమాలో కీలకపాత్రలో సినిమా ఛాన్స్ ఇచ్చింది. ఈ సినిమాతో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తన పాత్రకు మంచి పేరు రావడంతో స్మిత తర్వాత వరుస సినిమా ఆఫర్లను అందుకుంది. కాగా గతంలో స్నిగ్ధ తన పెళ్లి గురించి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆ వీడియో నెట్టింట సందడి చేస్తుంది. ఓ ఇంటర్వ్యూలో ఎదురైనా ప్రశ్నకు ఆమె స్పందిస్తూ నాకు పెళ్లి బంధం పై అసలు నమ్మకం లేదు.. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు.. ఇప్పటివరకు నా జీవితంలో అలాంటి సిచ్యువేషన్ కూడా ఎప్పుడు ఎదురు కాలేదు.
ప్రస్తుతం నేను దీక్షలో ఉన్నాను. 120 రోజులు పాటు ఇలా దీక్షలోనే టైం గడిపేస్తా.. పెళ్లి చేసుకుంటే నేను మరొకరి ఆధీనంలో ఉండాల్సి వస్తుంది. అందుకే మ్యారేజ్ చేసుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు అంటూ ఆమె వివరించింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్ని పిల్లలు కన్ని జీవితం అంత వారి చుట్టూ తిరిగే బదులు.. హాయిగా సంపాదించిన దాంట్లో మనం ఎంజాయ్ చేసినంత వరకు ఎంజాయ్ చేసి.. మిగిలిన డబ్బు అనాధాశ్రమాలకు ఇచ్చేస్తే వారైనా బాగుపడతారు. ప్రస్తుతం నేను అలాంటి పనే చేస్తున్న అంటూ ఆమె వివరించింది. తనకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్నిగ్ధ చేసిన ఆ కామెంట్స్ నెటింట తెగ చెక్కరలు కొడుతున్నాయి.