ప్రస్తుతం మనం స్మార్ట్ యుగంలో ప్రతీ రోజు సరికొత్త పరిణామాలు చోటు చేసుకోవడం చూస్తూనేఉన్నాం. ఈ స్మార్ట్‌లైఫ్ స్టైల్ కారణంగా మానవుల జీవితం.. గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. చాలా మంది నిపుణులు జీవితాన్ని మరింత ఈజీ చేయడానికి పగలు, రాత్రి శ్రమిస్తున్నారు. అయతే ఈ యూనివర్స్‌లొ చాలా మంది మనం చూడగలిగే దానికంటే డీప్ లేఫ్ స్టైల్ జీవిస్తారు. నేటికీ కొన్ని తెగలవారు సాధారణ ప్రజలకు దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. వారికి కొన్ని వింత నియమ, నిబంధనలుంటాయి. వాటిని తరువాతి తరాలు అనుసరిస్తున్నాయి. వాటిలో వివాహం ముఖ్యమైనది. ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహం ఎంతో కీలకమైంది.
చనిపోయే వరకు గుర్తుంచుకునే అద్భుతమైన జ్ఞాపకం. ఆ రోజు నుంచే లైఫ్ లో కొత్త ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇక ఈ పెళ్ళిలు రాష్ట్రాన్ని, సామాజిక వర్గాన్ని బట్టి సంప్రదాయాలు మారతాయి. అంతేకాదు.. వివాహ చట్టాలు కూడా వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా రూపొందాయి. పూర్వకాలంలో బహు భార్యత్వ విధానం ఉండేది. పురుషుడు ఎంతమందినైనా వివాహం చేసుకునే పద్దతిని పాటించేవారు. కానీ కాల క్రమనా ఆ సంప్రదాయం కనుమరుగైంది. చాలా చోట్ల ఏక పత్రీవ్రతాన్నే అనుసరిస్తున్నారు. ఒకవేళ రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం తప్పనిసరి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే సంప్రదాయముంది. ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా దేశంలో ఈ వింత వివాహ సంప్రదాయం కొనసాగుతుంది. ఇది సంప్రదాయం మాత్రమే కాదు.. రూల్ కూడా.
అక్కడ ప్రతీ మగవాడు రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి. ఒకవేళ రెండో పెళ్లి రిజక్ట్ చేస్తే వారిని జైలులో వేస్తారు. ఏకంగా జీవిత ఖైదు శిక్ష పడుతుంది. స్త్రీలు కూడా దీనిని అంగీకరించక తప్పదట. మరో మహిళతో కలిసి భర్తను పంచుకోవటంలో అడ్డు చెబితే.. వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటారు. అందుకు ఇష్టం ఉన్నా లేకున్నా.. భర్తతో సంతోషంగా లేకపోయినా ఈ నిబంధనను పాటించాలి. పురుషులు కూడా తనకు ఇష్టం లేకున్నా.. పోషించే శక్తి లేకున్నా సంప్రదాయాలకు విలువిస్తూ.. చట్టాలని గౌరవిస్తూ అక్కడి మగవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు.