టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ వరుస సినిమాలో నటిస్తు లేటెస్ట్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్న ఈ యంగ్ హీరో సినిమాలతో పాటు కాంట్రవర్షియల్ కంటెంట్ తోను నెట్టింట చెక్కర్లు కొడుతూ ఉంటాడు. అయితే గతంలో విశ్వక్సేన్ కు.. తమిళ్ హీరో అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా విషయంలో వివాదం తలెత్తింది అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో అర్జున్ విశ్వక్సేన్కు కమిట్మెంట్ లేదంటూ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడంతో ఈ వార్తలు నెట్టింట తెగ వెరల్ అయ్యాయి.
విశ్వక్సేన్కు కమిట్మెంట్ లేదంటూ అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం చాలా చర్చినీయింశంగా మారింది. దీనిపై తాజాగా ఇంటర్వ్యూలో స్పందించాడు విశ్వక్సేన్ . ఆయన మాట్లాడుతూ నేను సినిమా క్యాన్సిల్ చేయమని చెప్పలేదు. ఒకరోజు షూటింగ్ ఆపమని మాత్రమే చెప్పా.. దానికి అర్జున్ మా ఇంటికి వచ్చి మా వాళ్లతో మాట్లాడారు. నేను తీసుకున్న రెమ్యూనరేషన్‌కు డబల్ రెమ్యునరేషన్ ఆయనకు వెనక్కి ఇచ్చేసా. కనుక నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఇప్పటికీ ఆ విషయాన్ని ఎక్కడికి వెళ్లినా సాగదీస్తూనే ఉన్నారు. అలా ఎక్కువగా ల్యాగ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇలా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోతో అయితే కచ్చితంగా ప్రవర్తించరు. నాకు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టే ఆయన అలా ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా మాట్లాడగలిగారు. జరిగిన పరిణామాలు ఎవ్వరికి తెలియదు. అర్జున్ కోపంలో చేసిన పనికి నేను ఎక్కువగా నష్టపోతున్న అంటూ వివరించాడు. కాగా ప్రస్తుతం విశ్వక్ నటించిన గామి రిలీజ్ కు సిద్ధంగా ఉంది.