ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాకింగ్ అప్డేట్.. అదేంటంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జపాన్ లోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా ఆయన డ్యాన్స్ లకు జపాన్ లో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు అక్కడ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తార‌క్ చివ‌రిగా న‌టించిన మూవీ ఆర్‌ఆర్ఆర్ కి అయితే జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్టీఆర్ మరో సినిమాతో జపాన్ ఆడియన్స్‌ని పలకరించబోతున్నారు.

ఎన్టీఆర్ తన మాస్ ఇమేజ్‌ని పక్కన పెట్టి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బృందావనం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాల్లో కాజల్ అగర్వాల్, సమంత కథానాయకులుగా నటించారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా 2017 అక్టోబర్ లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇందులో ఎన్టీఆర్ లుక్స్, కామెడీ, డ్యాన్స్ అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడే సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా ఉంది.

అయితే ఒడియా, కన్నడ, బెంగాలీ, భోజ్‌పూరి, మరాఠీ లాంటి పలు భాషల్లో సినిమా రీమేక్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మార్చి 15 న జపాన్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు ఆడియో జపనీస్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమా జపాన్ ఆడియన్స్ను పలకరించనుంది. ఇప్పటికే జపాన్‌లో ఎన్టీఆర్ అభిమానులు పోస్టర్లతో సందడి చేయడం మొదలుపెట్టారు. మరి ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని భాషల్లో మంచి సక్సెస్ అందుకున్న బృందావనం.. జపాన్‌లో ఎలాంటి సక్సెస్ను అందుకుంటుందో వేచి చూడాలి.