వాట్: కోట్లలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న రకుల్ ప్రీత్.. మొదటి సంపాదన మరీ అంత తక్కువ..!!

కన్నడ మూవీ గిల్లి సినిమాతో వెండితెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్ 2009లో రిలీజై ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. అయితే తన రెండో సినిమా తెలుగులో నటించింది. కెరటం టైటిల్ తో రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆమెకు మంచి ఇన్వెజ్ క్రియేట్ చేసింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవా సినిమాల‌తో టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించించి భారీ పాపులారిటి ద‌క్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మూడు కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. కాగా రకుల్ కెరీర్ మోడల్ గా మొదలై.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

అయితే ఆమె మోడల్ గా ఉన్న రోజుల్లో మొదటి సంపాదన ఎంతో తాజా ఇంటర్వ్యూలో వివరించింది. రకుల్ ప్రీత్ మాట్లాడుతూ ఇండస్ట్రీ లోకి వచ్చాక 25 ఏళ్ల వయసు వచ్చేవరకు మా అమ్మ నాకు తోడుగా ఉండేది. మోడల్‌గా నా మొదటి సంపాదన రూ.5000 అక్కడ నుండి ఇప్పుడు ఈ రేంజ్ కి వచ్చాను. ఈ సక్సెస్ఫుల్ జర్నీలో నా తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు నన్ను బాగా ప్రోత్సహించారు. నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. వాళ్ళు లేకపోతే నేను చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది అంటూ రకుల్ ప్రీత్ వివరించింది. త్వరలో పెళ్లి పీటలేకపోతున్న ఈ ముద్దుగుమ్మ నటుడు, నిర్మాత జాకీభగ్నానితో ఏడడుగులు వేయబోతుంది.

గోవాలో ఫిబ్రవరి 21న‌ గ్రాండ్గా వీరిద్దరి వివాహం జరగనుంది. రకుల్ ప్రీత్ పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప‌లువురు ప్రముఖులు హాజరై సందడి చేయనున్నారు. 2021 లో జాకీ భ‌గ్నానిని ప్రేమిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ.. హిందీలోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తోంది. ఇక తాజాగా తమిళ్ లోను ఆయాలన్‌ సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం మేరీ పత్రిక రీమేక్, ఇండియన్ 2 సినిమాల్లో రకుల్ న‌టిస్తుంది. రకుల్ ప్రీత్ స్టార్‌డం కాస్త తగ్గి కెరీర్ నెమ్మదించిన సమయంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాల‌ని తెలివైన డెసీష‌న్ తీసుకుంది. అయితే ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రకుల్ మొదటి సంపాదన 5వేల‌ని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. మరి అంత తక్కువ జీతానికి పనిచేశావా అంటూ ఆశ్చర్యపోతున్నారు.