టాలీవుడ్ లో మొదటిసారి వెయ్యి కోట్ల కలెక్షన్ అందుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం.. ఆమె ఎవరంటే..?!

ఇటీవల కాలంలో ఒక్క సినిమాకు కోటి రూపాయలు కాదు ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు వస్తున్న సినిమాలు చాలానే ఉంటున్నాయి. బాహుబలి తర్వాత ఈ రికార్డును చాలా సినిమాలు బ్రేక్ చేస్తున్నాయి. అయితే గతేడాది షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు కూడా వేయికోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ళ‌ను కొల్లగొట్టి రికార్డులు సృష్టించాయి. ఇంకా మొట్టమొదటిసారి వేయకోట్ల కలెక్షన్ రాబట్టిన‌ సినిమా ఏది అందులో నటించిన హీరోయిన్ ఎవరు అని అంశం మాత్రం చాలా మందికి తెలియదు.. తను ఎవరో కాదు మన టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి.

ఇంతకీ ఆ సినిమా ఏంటి అని ఆలోచిస్తున్నారా అదే 2017లో రిలీజ్ అయి సంచలన సృష్టించిన బాహుబలి 2. ఈ మూవీ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన పార్ట్ వన్ లో కథానాయకగా తమన్న నటించింది. ఇందులో అనుష్క కనిపించిన ఆమె పాత్రకు అంత నడివి లేదు. కానీ రెండవ భాగంలో అనుష్క పాత్రకే ఎక్కువ నడివి.. ఇంపార్టెన్స్ ఉంది. ఈ మూవీలో ఆమె పాత్ర హైలెట్గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్ చేసింది.

అలా వెయ్యి కోట్ల కలెక్షన్ రాబట్టి సక్సెస్ సాధించిన మొదటి కాదా నాయకగా అనుష్క రికార్డ్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె రెండు మూడు సినిమాలు నటించిన ఊహించిన సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఎంట్రీకి ప్ర‌య‌త్నాలుచేస్తూ మిస్‌శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కొంతకాలం గ్యాప్ తర్వాత మరోసారి డైరెక్టర్ క్రిష్ సినిమాలో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించినుంది స్వీటి.