ఎటువంటి సిని బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఎదిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో రవితేజ ఒకరు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత స్టార్ హీరోగా ఎదగాలంటే కేవలం కష్టం, టాలెంట్ ఉంటే సరిపోదు కొద్దిగా అదృష్టం కూడా ఉండాలి. రవితేజకు అదృష్టం బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. అయితే రవితేజ కూడా అంత ఈజీగా హీరో అయిపోలేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక.. ఎన్నో కష్టాలు పడ్డాడు.
మాస్ మహారాజ్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, సీరియల్ యాక్టర్‌గా ఎన్నో రోల్స్ ను ప్లే చేసిన రవితేజ చివరిగా హీరో ఛాన్స్ ని దక్కించుకొని తన సత్తా చాటాడు. తర్వాత సినిమా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోగా మారాడు. ఒకప్పుడు వేరే హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన రవితేజకు.. ఇప్పుడు తన సినిమాల్లోనే ఆ హీరోలు సైడ్ క్యారెక్టర్లో చేస్తున్నారు. ఆ స్టేజ్ కు రవితేజ ఎదిగారు. ఇదిలా ఉంటే రవితేజ కేవలం సినిమాల్లోనే కాదు తన కెరీర్ స్టార్టింగ్ లో టీవీ సీరియల్లో కూడా నటించారు. ఈ విషయం చాలామందికి తెలియదు.
అప్పట్లో దూరదర్శన్ లో వచ్చే ఋతురాగాలు అనే సీరియల్ లో ఓ ఎపిసోడ్ లో రవితేజ చిన్న పాత్రలో మెరిసాడు. ఈ సీరియల్ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న రోల్స్ లో నటిస్తున్న రోజుల్లో.. రవితేజ సీరియల్ నటించాడు. అయితే ఈ సీరియల్ తర్వాత రవితేజకు ఎన్ని సీరియల్స్ లో ఆఫర్స్ వచ్చినా వాటిని రిజెక్ట్ చేశారట. ఇక రవితేజ నటించిన ఆ సీరియల్‌కు.. రాజీవ్ కనకాల హీరోగా నటించగా, రూపా దేవి హీరోయిన్ గా నటించారు.
అయితే అలా చిన్న చిన్న రోల్స్ లో నటించిన రవితేజ ఇప్పుడు మాస్ మహారాజ్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన రవితేజ.. ప్రస్తుతం ఈగిల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కచ్చితంగా ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.