అరుంధతిలో అనుష్క.. బాహుబలిలో శివగామి దేవి.. రెండు బ్లాక్ బస్టర్ పాత్రలను వదులుకున్న అన్ లక్కీ హీరోయిన్ ఈమె..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం ..మాయలోకం ఎప్పుడు ఏమైనా జరగొచ్చు . ఏం జరుగుతుందో ..ఎవ్వరు గెస్ చేయలేరు. కొన్నిసార్లు కోరి వచ్చిన అవకాశాలను కూడా టైం బాగోలేక రిజెక్ట్ చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం . రీసెంట్గా చాలామంది బ్యూటీస్ అలా మంచి మంచి అవకాశాలను మిస్ చేసుకున్నారు . అయితే గతంలో నటి అలాంటి అవకాశం మిస్ చేసుకుని కెరీర్ ని డిజాస్టర్ గా మార్చుకున్న న్యూస్ మరోసారి వైరల్ గా మారింది.

ఆమె మరి ఎవరో కాదు మంచు లక్ష్మి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి.. అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించింది . ఆ తర్వాత పలు సినిమాల్లో కీలకపాత్రలో మెరిసింది . అయితే అరుంధతి సినిమాలో అనుష్క పాత్ర కోసం ముందుగా ఆమెని అప్రోచ్ అయ్యారట మేకర్స్. అయితే మంచు లక్ష్మి ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేశారట .

ఆ తర్వాత కొంతకాలానికి బాహుబలి సినిమాలో శివగామి దేవి పాత్ర కోసం శ్రీదేవిని అప్రోచ్ అవ్వగా ఆమె రిజెక్ట్ చేయడంతో మంచు లక్ష్మిని అప్రోచ్ అయ్యారట రాజమౌళి . కానీ ఏజ్డ్ పాత్ర అంటూ ఈ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిందట. అలా మంచి పాత్రలను రెండూ మిస్ చేసుకున్నింది మంచు లక్ష్మి అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ రెండు సినిమాలలో ఏ ఒక్క సినిమా చేసిన కూడా మంచు లక్ష్మి ఇప్పుడు ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోవచ్చు..?