104 డిగ్రీల జ్వరంతో మహేష్ బాబు చేసిన సినిమా ఏంటో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు

సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొందరు చాలా లైట్ గా తీసుకుంటారు . మనం స్టార్ హీరో అయిపోయాం. మనకి పేరు పలుకుబడి వచ్చేసింది.. ఇక ఎప్పుడైనా మనం సినిమాలు చేయొచ్చు డైరెక్టర్స్ ని మనం గ్రిప్ లో పెట్టుకోవచ్చు ..డైరెక్టర్స్ మన ఇంటి చుట్టూరు తిరుగుతారు అన్న ఆలోచనలో ఉంటారు . మరి కొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీని దైవంలా భావిస్తూ సినిమా అవకాశం వస్తే చాలు జనాలకి మనమేంటో ప్రూవ్ చేసుకోవాలి అంటూ చాలా డెడికేషన్ తో వర్క్ చేస్తారు . ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు మహేష్ బాబు .

తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన స్థాయిని పెంచుకోవడానికి మాత్రం ఎప్పుడు కృష్ణ పేరుని ఉపయోగించుకోలేదు . తన సొంత టాలెంట్ తో మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు తన కెరీర్ లో ఒక సినిమా మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అదే మురారి .

మురారి సినిమా ఆయన 104 జ్వరంతో చేశారట. మరీ ముఖ్యంగా “భామ భామ ” సాంగ్లో ఆయనకు జ్వరం మరింత ఎక్కువగా ఉండిందట . డాక్టర్స్ అసలు డాన్స్ చేయకూడదు చన్నీళ్ళతో తడవకూడదు అని చెప్పారట . కానీ తన వల్ల వేరే వాళ్ళ షెడ్యూల్ ఇబ్బంది పడకూడదు అని ఆ ఏజ్ లోనే మహేష్ బాబు చాలా డేర్ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ సరే వద్దు అని చెప్పినా కూడా మహేష్ బాబు తెగించి జ్వరంతోనే ఆ సినిమాలో ఆ పాటలో డాన్స్ చేశారు . అంతేకాదు చన్నీళ్లలో తడుస్తూ వణికిపోతూ మరి ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కనిపియ్యకుండా కవర్ చేసారు. అందుకే ఈయన సూపర్ స్టార్ గా మారిపోయాడు అంటున్నారు జనాలు..!!