“అది ఓ పరమ చెత్త షో..దాని గురించి అడగకండి”.. బిగ్ బాస్ పై నాగార్జున షాకింగ్ కామెంట్స్(వీడియో)..!!

పాపం .. నాగార్జున సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. అసలకే తన కొడుకుల విషయం కారణంగా ఆయన సోషల్ మీడియాలో నిరంతరం టృఓలింగ్ కి గురవుతుంటే తాజాగా ఆయన చేసిన ఓ తప్పుడు పని ఇప్పుడు ఆయనను సోషల్ మీడియాలో ఏకిపారేశాల చేస్తుంది. మనకు తెలిసిందే నాగార్జున బిగ్ బాస్ షోకి హోస్టుగా చేస్తున్నారు.  గత ఐదు సీజన్లుగా బ్యాక్ టూ బ్యాక్ ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒకప్పుడు నాగార్జున దేవదాస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది.  ఆ వీడియోలో నాగార్జున ను యాంకర్ “బిగ్ బాస్ షో చూస్తారా ..?” అని ప్రశ్నించగా.. నాగార్జున మాట్లాడుతూ..” దాని గురించి మాట్లాడకండి ..అది నేను మాట్లాడితే బ్యాడ్ గా వస్తుంది .. అసలు అది షో నేనా..? పరమ చెత్త..పక్కన వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం ఏంటి..?”

” అంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా..?” అంటూ బిగ్ బాస్ షో పై నెగిటివ్గా కామెంట్ చేశారు.  అయితే బిగ్బాస్ అంటే ఇష్టం లేని నాగార్జున హోస్ట్ గా ఎందుకు ఒప్పుకున్నాడు..? అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.  అంతేకాదు డబ్బు కోసం ఏమైనా చేస్తావా ..? అంటూ నిలదీస్తున్నారు.  దీంతో ఆ వీడియో వైరల్ అవుతుంది..!!