అందరి ముందు రానా చెంప చెల్లుమనిపించిన స్టార్ హీరోయిన్… పాపం అలా కొట్టేసింది ఏంటి…!!

టాలీవుడ్ స్టార్ హీరో రానా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తిరుగులేని కెరీర్ తో దూసుకుపోతున్నాడు. ఈయన నటనతో ఎంతోమంది అభిమానులని సైతం సంపాదించుకున్నాడు. కానీ ఈయనకు అనారోగ్య సమస్యలు రావడంతో సినిమాలు చేయడం లేదు.

ఈ విషయాన్ని రానా సైతం అనేక ఇంటర్వ్యూలలో తెలిపాడు. ఇటీవల రానా ” రానా నాయుడు ” అనే వెబ్ సిరీస్ తో పలకరించాడు. ఆ తర్వాత నిఖిల్ ” స్పై ” సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పట్లో ఆయన ఒక హీరోయిన్ తో సరదాగా మాట్లాడిన.. మాటలను ఆమె డబల్ మీనింగ్ కింద అర్థం చేసుకుని రానా చెంప చెల్లుమనిపించిందట.

షూటింగ్ స్పాట్లో అందరి ముందు ఆమె కొట్టడంతో రానాకి తల తీసేసినట్లు అయ్యిందట. అంతేకాకుండా ఆ స్టార్ హీరోయిన్ తనతో ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడే సాహసం చేయొద్దని వార్నింగ్ సైతం ఇచ్చిందట. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.