ఆ క్వాలిటీ ఉంటే మెగా కోడలు అయిపోతున్నారు..మీరు గమనించారా..!!

త్వరలోనే లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలు కాబోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . వరుణ్ తేజ్ తో ఏడడుగులు వేయడానికి సిద్ధపడిపోయింది ఈ హీరోయిన్. కాగా నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో పెళ్లి గ్రాండ్గా జరగబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా కోడలు కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే మెగా కోడలు అయిన ముగ్గురిలోనూ  ఒక కామన్ క్వాలిటీ ఉంది . అదే హెల్పింగ్ నేచర్ . చిరంజీవి భార్య సురేఖకు ఎలాంటి హెల్పింగ్ నేచర్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన వద్ద లేకపోయినా పెట్టే టైప్ . అలాంటి క్వాలిటీసే మెగా కోడలు ఉపాసనాలోనూ ఉన్నాయి.  కోట్ల ఆస్తి ఉన్న  ఆమె ప్రజలకు ఎంతో ధారపోస్తుంది ..సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది .

అయితే అవే క్వాలిటీస్ లావణ్య త్రిపాథి కి కూడా ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . పైకి చెప్పడం లేదు కానీ లావణ్య త్రిపాఠి సైతం పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. ప్రజాసేవ చేస్తుంది.. హెల్పింగ్ చేస్తుంది . దీంతో అలాంటి మంచి మనసు ఉంటే .. మెగా ఇంటికి కోడలు అవుతున్నారు అంటూ ఫ్యాన్స్ సరికొత్త న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు.