యంగ్ సింహంలా బాలయ్య..సమరసింహా రెడ్డి రోజులు గుర్తుచేస్తున్నాడుగా..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో .. వెబ్ మీడియాలో ..టాలీవుడ్ నట సింహం నందమూరి బాలయ్య కొత్త పిక్చర్స్ వైరల్ గా మారాయి.  రీసెంట్ గానే భగవంత్  కేసరి అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య త్వరలోనే బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతో కూడా అంతే హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

అయితే భగవంత్ కేసరి సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న బాలయ్య తన న్యూ లుక్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు.  ఎప్పుడు గుబురు గడ్డంతో.. పెద్దపెద్ద మీసాలతో మాస్ యాంగిల్ లో కనిపించే బాలయ్య ఫస్ట్ టైం క్లీన్ షేవ్ తో చాలా హ్యాండ్ సమ్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు . ఈ పిక్స్ చూసిన అందరూ యంగ్ సింహంలో బాలయ్య మారిపోయాడు అంటున్నారు .

మరికొందరు సమరసింహారెడ్డి సినిమా టైం లోని రోజులు గుర్తు చేస్తున్నాడు అంటూ పొగిడేస్తున్నారు. ఏ మాటకు ఆ మాటే గడ్డం తీసేస్తే మన బాలయ్య లుక్స్ కేక పెట్టించేలా ఉంటాయి అని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!