త్వరలోనే భగవంత్ కేసరి 2.. కానీ హీరో బాలయ్య కాదు.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!!

టాలీవుడ్ నట సిం హం నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా భగవంత్ కేసరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ నమోదు చేసుకుంది . దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే  సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

అంతేకాదు బాలయ్య నటన ఈ సినిమాకి హైలైట్ గా మారింది . సినిమా హ్యూజ్ సక్సెస్ అవ్వడంతో భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్ . ఈ క్రమంలోనే సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా పాల్గొన్న బాలయ్య లుక్స్ వైరల్ గా మారాయి . అంతేకాదు ఈవెంట్ కి వచ్చిన నందమూరి అభిమానులు భగవంత్  కేసరి 2  పై అప్డేట్ ఇవ్వమంటూ అడిగారు .

దీంతో స్పందించిన అనిల్ రావిపూడి “ఇప్పటికే ఈ బరువు మోయలేక పోతున్నాను..ఒకవేళ బాలయ్య కచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తే .. త్వరలోనే భగవంత్  కేసరి 2  కూడా ఉంటుంది ” అంటూ క్రేజీ హింట్ ఇచ్చారు.  అయితే జనాలు భగవంత్ కేసరి 2 సినిమా తెరకెక్కిస్తే తన కొడుకు మోక్షజ్ఞ హీరోగా పెట్టి బాలయ్యను తండ్రి చేసుకొని సినిమాను డైరెక్టర్ చేయగలిగితే బాగుంటుంది అంటూ సొల్యూషన్స్ ఇస్తున్నారు..!