భగవంత్ కేసరి ఎఫెక్ట్: ఇంటికి వచ్చి శ్రీలీలను పొగిడేసిన బాలీవుడ్ హీరో ..ఎవరంటే..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే .. యంగ్ బ్యూటీ శ్రీ లీల.. పేరే ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది.  మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు గ్లామరస్ పాత్రలో కనిపించిన నటించిన ఈ బ్యూటీ రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో ఎమోషన్ సీన్స్ తో ఆకట్టుకునింది.  యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసింది . దీంతో శ్రీ లీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.

అయితే భగవంత్ కేసరి సినిమాని చూసిన బాలీవుడ్ హీరో శ్రీలీల పెర్ఫార్మెన్స్ కు మెచ్చి.. ఏకంగా ఇంటికి వెళ్లి అప్రిషియేట్ చేసి ఆఫర్ ఇచ్చారట . బాలీవుడ్లో ఇండస్ట్రీలోనే బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ స్టార్ శ్రీ లీల కు తన నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే శ్రీ లీల మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసే దానికి రెడీగా లేదట .

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా మంచి మంచి రోల్స్  చేయాలనుకుంటుందట . ఓవైపు చదువు మరో వైపు సినిమాలు మేనేజ్ చేయడం కష్టంగా ఉంది అని..  ఇదే టైంలో బాలీవుడ్ కి కూడా కమిట్ అయితే చదువు లో తాను అనుకున్న సక్సెస్ సాధించలేను అంటూ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట..!