మొబైల్ లో వెంటనే ఈ ఫేక్ యాప్ ఉంటే డిలీట్ చేయండి.. లేకపోతే ఖాతా ఖాళి..!!

ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం వార్నింగ్ తెలియజేస్తున్నారు టెక్ నిపుణులు ..ఎవరైనా మొబైల్ లో మాల్వేర్ యాప్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.. ఒకవేళ ఉంటే పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్లు కొట్టేసే ప్రమాదం ఉందట. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో పరిశోధకులు spynote (స్పై నోట్) అనే ఒక తప్పుడు ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ డేటా ను కనుగొనడం జరిగింది.. ఈ మార్వెల్ యాప్ మీ మొబైల్ లో ఉంటే సిస్టంకు సాధారణ అప్డేట్గా కనిపిస్తుందట. ఈ ఫేక్ యాప్ వల్ల సైబర్ నేరగాళ్లు ప్రత్యేకంగా యాక్సెస్ చేసుకునేలా సదుపాయం ఉంటుందట.

ఈ యాక్సెస్ ను పొందిన తర్వాత టెక్స్ట్ మెసేజ్లు ముఖ్యమైన బ్యాంకింగ్ సమాచారాన్ని సైతం ఎక్కువగా దొంగలించడానికి అనుమతి ఉంటుందట. F -సెక్యూర్ అని సైబర్ సెక్యూరిటీ కంపెనీలు తెలిపిన వివరాల ప్రకారం ఈ మార్వెల్ ఎక్కువగా ఫేక్ టెక్స్ట్ మెసేజ్ ల ద్వారా వ్యాప్తి చెందుతుందని స్పెషల్ లింకు పైన క్లిక్ చేయడం ద్వారా వాటిని ఇన్స్టాల్ చేసేలా ప్రేరేపన చేస్తుందని టెక్ నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.

స్పైనోట్ యాప్ ఉన్నందున కాల్ లాగ్ లు, కెమెరా యాక్సెస్ టెక్స్ట్ మెసేజ్లు మన మొబైల్ స్టోరేజ్ వంటి సమాచారాన్ని మాత్రమే తీసుకోగలదట. మన మొబైల్ లో హైడ్ చేసుకోవచ్చు.. మీ హోమ్ స్క్రీన్ పైన ఇటీవల యాప్ లలో హైడ్ అయి ఉంటుందట. అంతేకాకుండా సెక్యూరిటీ సిస్టములను కూడా కనుగొనడం ఆపడం చాలా కష్టతరంగా మారుతుందట.. అలాంటి వాటిలలో ఈ స్పైనోట్ యాప్ కూడ ఒకటి.. మొబైల్ కాల్స్ తో సహా సౌండ్ రికార్డింగ్ చేయగలదట. స్పై నోట్ అనే యాప్ ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల మీ ఆండ్రాయిడ్ చోరబడే అవకాశం ఉండదని తెలుపుతున్నారు.