నందమూరి నటసింహం బాలకృష్ణ గత కొంతకాలంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న బాలయ్య భగవంత్ కేసరి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుల్లితెరపై ఆన్స్టాపబుల్ సీజన్ తో వెండితెరపై సూపర్ హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. భగవంత్ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి, బాలయ్య కాంబినేషన్లో ఇది మొదటి సినిమా.
ఇందులో కాజల్ హీరయిన్గా, శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్నారు. టాలీవుడ్ లో మ్యూజిక్ సెన్సేషన్ గా మారిన ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇలా అన్ని విషయాలు భగవంత్ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచాయి. పైగా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలక్షన్లువచ్చిన సినిమా కూడా ఇదే. ఇక ఇన్ని అంచనాలతో రిలీజైన సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో ఒకసారి చూద్దాం.
కథ :
అదిలాబాద్ ఫారెస్ట్ లో పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉన్న భగవంత్ కేసరి జైలు శిక్ష ఎలా అనుభవిస్తాడు..? భగవంత్ కేసరి జీవితంలో ఉన్న విజ్జి పాప కోసం బాలయ్య ఎవరికి ఏమి మాట ఇచ్చాడు..? ఆ మాట కోసం భగవంత్ తన జీవితాన్ని ఎలా త్యాగం చేశాడు..? మధ్యలో సైకియాట్రిస్ట్ కాత్యాయని ఎందుకు వచ్చింది..? దేశంలో నెంబర్ వన్ పారిశ్రామికవేత్తగా ఉన్న రాహుల్ సింగ్వి తో భగవంత్ కేసరికి వైరం ఎందుకు..? అసలు వీరిద్దరి మధ్యన పాతపాక ఏమై ఉంటుంది..? చివరికి విజ్జి పాప విషయంలో భగవంత్ కేసరి అనుకున్నది చేశాడా..? లేదా..? రాహుల్ సింగ్వి తనకు చేసిన అన్యాయానికి భగవంత్ కేసరి బుద్ధి చెప్పాడా..? అనే అంశాలు ఈ సినిమాలో చూపించారు.
రివ్యూ :
2 గంటల 44 నిమిషాల వ్యవధితో సినిమా మొదలైంది. మొదట బాలకృష్ణ జైల్లో సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు. ఐదు నిమిషాలకే బాలకృష్ణ జైలు రౌడీలకు మధ్యన ఫైట్ సీన్ వస్తుంది. అక్కడ నుంచి సన్నివేశం శ్రీ లీల – బాలయ్య సీన్లు వైపుకు మల్లుతుంది. ఫస్ట్ అఫ్ అంత వీరిద్దరి మధ్యన జరిగే సన్నివేశాలు వస్తాయి. శ్రీ లీలను తన టార్గెట్ వైపు నడిపించేందుకు బాలయ్య చేసే విఫల ప్రయత్నాలు.. కాజల్‌తో క్రేజీ లవ్ ట్రాక్ తో మంచి స్కోర్‌లో స్టోరీ నడిచింది. ఇక ఇంటర్వెల్ కు ముందు 30 నిమిషాల నుంచి కథ స్పీడ్ గా కొనసాగింది. అసలు రాహుల్ సింగ్వి బాలయ్యకు మధ్య గతంలో ఎలాంటి శత్రుత్వం ఉందనే ట్విస్ట్ రివీల్ అవడం జరిగిద్ది.
సినిమా స్టార్టింగ్ లోనే భగవంత్ కేసరి జైలు నుంచి రిలీజ్ కావడం.. విజ్జీ పాపను పెంచే బాధ్యత తీసుకోవడం.. (ఇంతకీ శ్రీ లీలా – బాలయ్య సొంత కూతురు కాదు) అటు దేశంలోని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ రాహుల్ సింగ్వి దేశంలో ఉన్న పోర్ట్లన్నింటినీ తన గ్రిప్‌లోకి తీసుకునే కాంట్రాక్ట్ ద్వారా నెంబర్ 1 అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టడం తో కదా స్టార్ట్ అయింది. సినిమాలో రాహుల్ సింగ్వి క్యారెక్టర్ సెంటిమెంట్ లెస్ గా కనిపిస్తోంది. తన కొడుకు చనిపోయిన కూడా రాహుల్ సింగ్వి పట్టించుకోడు. ఎలాగైనా శ్రీలీలను ఆర్మీ ఆఫీసర్‌ను చేయాలన్న ఆమె తండ్రి చనిపోయే ముందు కోరిక కోసం.. బాలయ్య కష్టపడుతూ ఉంటాడు. ఇక శ్రీ లీల మొండిఘటంలో భగవంత్ కేసరి మాటలు పట్టించుకోకుండా.. ప్రేమలో పడుతుంది.
బాలయ్య ఆవేశంతో ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడం.. అటు శ్రీలీల.. నువ్వు నన్ను వదిలేయ్ చిచ్చా అని ఎమోషనల్ అవ్వడం.. ఇవన్నీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఎమోషనల్‌గా కొంతసేపు ఈ కథ సాగుతుంది. నా లైఫ్ మీద నీ పెత్తనం ఏందీ.. నాకు నచ్చినట్టు బతకని.. నాకు ఆర్మీ వద్దు.. ఏమీ వద్దు.. నేను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో ఉండాలి అనుకుంటున్నా అంటూ శ్రీ లీల కంటతడి పెట్టుకునే సీన్ ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి శ్రీలీలను పెంచితే విజ్జి పాప తండ్రి మాట లెక్కచేయకుండా ఇబ్బందుల్లో పడుతుంది.
ఆ టైంలో ఆమెని సేవ్ చేసేందుకు చేసే ప్రయత్నాలు.. ఆమె ఆ ప్రయత్నాలకు అడ్డుపడడం.. ఇలా దర్శకుడు కథను నడిపే తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక బాలయ్య – శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన సాంగ్‌లో ఇద్దరు వేసిన స్టెప్పులు చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా శ్రీలీలకు పోటీగా బాలయ్య ఈ సాంగ్స్ లో స్టెప్స్ వేసి ప్రేక్షకులను అలరించాడు. ఈ సాంగ్ ధియేటర్లో రన్ అయినంత సేపు ప్రేక్షకులంతా బాగా ఎంజాయ్ చేశారు. భగవంత్ కేసరి.. ఇక్కడ బ్యూటిఫుల్ నైట్.. అక్కడ మూన్ లైట్.. చేతిలో ఐస్ క్రీమ్ అంటూ పోయిటిక్గ్గా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. బాలయ్యను లైన్లో పెట్టేందుకు కాజల్ పడే పాట్లు ప్రేక్షకులను నవ్విస్తాయి.
కాజల్ – బాలయ్య లవ్ కామెడీ ట్రాక్ లో దర్శకుడు రూపొందించాడు. ఇక సెకండ్ హాఫ్ లో భారీ ఫైరింగ్ అన్న కాదని గ్యాస్ సిలిండర్ లను వాడి విలన్లను పరిగెత్తించే ఫైట్ సీన్స్ అల్టిమేట్‌గా అనిపించాయి. సెకండ్ హాఫ్ లో రాహుల్ సింగ్వి భగవంత్ కేసరిల మధ్య బలమైన ఎత్తులు పై ఎత్తులతో.. వివాదాల సీన్లు ఇంకా రాసుకుని ఉంటే బాగుండు అనిపించింది. ఒకచోట మరీ బాలయ్య వార్ వన్ సైడ్ షో నడిపినట్టుగా అనిపిస్తుంది. డైలాగులు మాత్రం సినిమాలో టన్నులు కొద్ది ఇచ్చి పడేసాడు బాలయ్య. ఫ్యాన్స్ కు డైలాగ్స్ విషయంలో కొదవలేదు. అయితే అందుకు తగ్గ బలమైన కథ లేదనిపించినా.. తీత స్ట్రాంగ్ గా ఉంది. ఎమోషనల్‌గా సినిమా చూపించాడు.
నటీనటుల యాక్టింగ్ :
ఈ మూవీలో బాల్లయ్యను కొత్తగా చూడొచ్చు. ఇప్పటివరకు యాక్టింగ్ సీన్లలో మాత్రమే ఊహించుకోగలిగిన బాలయ్యను.. కామెడీ యాక్షన్ సీన్స్, కామెడీ లోను ఈ సినిమాలో చూపించాడు. అనిల్ రావిపూడి బాలయ్య యాక్షన్ ఈ సినిమాలో అదరగొట్టాడు. బాలయ్య – శ్రీ లీల మధ్యన జరిగే ఎమోషనల్ సీన్స్ లో బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. ఇక బాలయ్య తర్వాత చెప్పుకోవలసింది శ్రీ లీల మొదట ఆడుతు పాడుతు లైఫ్ ఎంజాయ్ చేసి, కాలేజ్ పిల్లల కనిపించిన శ్రీ లీల తర్వాత తండ్రి మాటకు ఎదురు చెప్పి లక్ష్యాన్ని విరమించుకునే అమ్మాయిగా.. ఆ తర్వాత చనిపోయిన తండ్రికి ఇచ్చిన మాట కోసం ఆర్మీలో చేరిన అమ్మాయిగా ఎలా పరిణితి చెందిందో నటనతో చూపించింది.
ఈ సినిమాలో శ్రీ లీల క్యారెక్టర్ ఆమె కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే శ్రీలీలకు ఇలాంటి క్యారెక్టర్ రావడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఆమె కూడా ఆ పాత్రకు తగ్గట్టుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక కాజల్ – బాలయ్య మధ్య లవ్ ట్రాక్ లో వచ్చే ఫన్నీ ఇన్సిడెంట్లు తప్ప కాజల్ సినిమాకు అంతగా హైలెట్ అనిపించలేదు.
అసలు సినిమాలో కాజల్ లేకపోయినా క్లాస్ ఏం లేదు. ఇక విలన్ గా అర్జున్ రామ్‌పాల్ బాలయ్యకు గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు అనిపించింది. చూడడానికి విలన్ గా గట్టి కాంపిటేటర్ గా అనిపించిన రొటీన్ విలన్ స్టోరీస్ ని రన్ చేస్తూ అంతా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఇక నటుల్లో సుబ్బరాజు, శివాజీ తో పాటు ఇతర పాత్రలకు కూడా పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు సినిమాల్లో బాలయ్య లేని ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించుకోలేము సినిమా మొత్తం వన్ మ్యాన్ ఆర్మీ షో లాగా బాలయ్య చుట్టూనే తిరిగినట్లు అనిపించింది.
టెక్నికల్ రివ్యూ :
టెక్నికల్ గా థమన్‌కి మంచి మార్కులు వేయవచ్చు. అక్కడ అంత రేంజ్లో లేకపోయినా సినిమాలు చూసి ఎంజాయ్ చేసే విధంగా అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అయితే ఆరో సీన్లలో మాత్రం ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ కి సిమిలర్‌గా అనిపించింది. అయితే ఉన్న రెండు పాటలు వినడానికి అంటే తెరమీద చూసినప్పుడు బాగా అనిపించాయి. శ్రీరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాలే సినిమాలంటే ప్రాణం పెట్టేస్తాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాల్లో సీన్లు కూడా అందుకు తగ్గట్లుగానే ఉన్నాయి. ఎక్కువ క్లోజప్ షాట్స్ పడటంతో మరీ కష్టపడడానికి ఏం లేదనిపించింది. వెంకట్ యాక్షన్ అదిరిపోయింది. సినిమాలో ఫస్ట్ ఫైట్ తో మొదలుపెట్టి ఇంటర్వెల్ ఫైట్ సెకండ్ హాఫ్ లో ఫైట్లతో పాటు క్లైమాక్స్ అదిరిపోయే యాక్షన్ సీన్లో ఉన్నాయి.
బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రమే కాదు యాక్షన్ మాస్ జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే యాక్షన్ కొరియోగ్రఫీ ఈ సినిమాలో కనిపించింది. సెకండ్ హాఫ్ లో బాగా క్రేజీగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో శ్రీ లీలతో పాటు కథలోకి వెళ్లే ముందు కొంత బోరింగ్ అనిపించిన ఆ తర్వాత శ్రీలీలా ఇలా చైల్డ్ హుడ్ మొత్తం చూపించకపోతే బాగోదేమో అనిపించింది. ఇక కామెడీ మార్కెట్ అనిల్ రావిపూడి తన సినిమాలకు భిన్నంగా కామెడీ ట్రాక్ ని పక్కన పెట్టి మరీ ఓ సీరియల్ యాక్షన్ కాదు బాలయ్యతో తర్కెక్కించడానికి ట్రై చేశాడు. అనిల్ అనుకున్న ఆలోచన మంచిదే కానీ అందుకు తగ్గట్టుగా బలమైన కదా అనిపించలేదు. కానీ ఇంప్లిమెంటేషన్ లో మాత్రం అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకులకు అన్ని విధాల కనెక్ట్ అవుతుంది.
ఇక సినిమాకు ప్లస్ పాయింట్స్ :
బాలయ్య ఒన్‌మెన్ షో,
బాలయ్య – శ్రీ లీల మధ్య ఎమోషనల్ సీన్స్,
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,
సుత్తి లేకుండా స్టోరీ చెప్పడం,
యాక్షన్స్ సన్నీ వేశాలు.
సినిమాలో మైనస్ పాయింట్లు :
ఫస్ట్ హాఫ్ ఊహించినరేంజ్లో లేదు.
అనిల్ రావిపూడి స్టోరీ వీక్ గా అనిపించింది.
భగవంత్ కేసరి ఫైనల్ ట్రీట్ :
యాక్షన్, ఎమోషన్ల కలబోత. ఫన్నీ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి.
రేటింగ్ : 3/5