కత్రినా కైఫ్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఏజ్ 40 దాటిస్తున్న సరే ఇంకా సెక్సీ ఫిగర్ ని మైంటైన్ చేస్తూ యంగ్ బ్యూటీస్ కి సైతం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మడు అంటే జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు . అలియా భట్ – సారా అలీ ఖాన్ లాంటి యంగ్ బ్యూటీస్ ఉన్నా సరే అందరూ కత్రినా కైఫ్ నే ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . దానికి కారణం అందం ఒక పాయింట్ అయితే .. ఆమె నటన మరో పాయింట్ అనే చెప్పాలి .
ఎటువంటి రోల్స్ నైనా అవలీలగా నటించే కత్రినా కైఫ్.. తెలుగులో పలు సినిమాలు చేసింది . కానీ పెద్దగా క్రేజ్ దక్కించుకోలేకపోయింది . మరీ ముఖ్యంగా మేకర్స్ తెగ టార్చర్ పెడుతుంది ఈ అమ్మడు అన్న నిందలు ఎప్పటినుంచో మోస్తుంది . అయితే చాలాకాలం టైం గ్యాప్ తర్వాత మళ్లీ కత్రినా కైఫ్ తెలుగులో భారీ ప్రాజెక్టులో నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
అంతేకాదు ఇది కూడా ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కత్రినా కైఫ్ తెలుగు అభిమానులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. మళ్ళీ ఇన్నాళ్లకు తెర పై చూడబోతున్నామంటూ హ్యాపీగా కామెంట్స్ చేస్తున్నారు..!!