ఊహ కంటే ముందే శ్రీకాంత్ ఆ హీరోయిన్‌ని ప్రేమించాడా.. ?!

టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట చాలా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌లో నటించిన శ్రీకాంత్ వన్ బై టు అనే సినిమాతో హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన శ్రీకాంత్ విలన్‌ పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. ఇక శ్రీకాంత్ నటించిన అన్ని సినిమాల్లో తాజ్ మహల్‌ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమా శ్రీకాంత్ సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. దీంతో వరుసగా స్టార్ డైరెక్టర్లు దర్శకత్వంలో సినిమాలు చేసే అవకాశాలు అందుకున్నాడు.

ఇండస్ట్రీలో ఎదుగుతున్న టైం లోనే హీరో – హీరోయిన్లకి ఎఫైర్ వార్తలు వినిపిమ‌చ‌టం కామ‌న్‌. శ్రీకాంత్ హీరోయిన్ ఊహా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పెళ్లి కంటే ముందే శ్రీకాంత్ మరో హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడిపాడు అంటూ న్యూస్ అప్పట్లో బాగా వినిపించింది. ఆ హీరోయిన్ ఎవరు.. శ్రీకాంత్ ఆమెని ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాంత్ హీరోగా వచ్చిన తాజ్‌మ‌హల్ సినిమాలో మౌనిక బేడి ఫస్ట్ హీరోయిన్ గా చేస్తే సెకండ్ హీరోయిన్గా సంఘవి నటించింది.

ఈ సినిమా తర్వాత సంఘవి.. శ్రీకాంత్ తో కలిసి పిల్ల నచ్చింది, మాణిక్యం, ప్రేయసి రావే లాంటి సినిమాల్లో కీలకపాత్రలో నటించింది. అయితే తాజ్‌మహల్ తర్వాత వరుసగా శ్రీకాంత్ – సంఘవి కలిసి నటించడంతో విరిద్ద‌రి మ‌ధ్య‌ ఎఫైర్ ఉందంటూ వార్త వైరల్ అయింది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీకాంత్ ఊహల‌ ప్రేమ‌ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో సంఘవి – శ్రీకాంత్ ఎఫైర్ వార్తలకు తెర ప‌డింది. ఇక వారికి కేవలం సినిమాలు మట్టికే మాత్రమే ఫ్రెండ్ షిప్ ఉంది. కానీ కొంతమంది కావాలని శ్రీకాంత్ ఎదుగుద‌ల‌ను త‌ట్టుకొలేక అలా ఎఫైర్ వార్తలు సృష్టించారట. ఇక ఊహ శ్రీకాంత్ పెళ్లి చేసుకోవడంతో ఎఫైర్ వార్తలు అన్నిటికి ఫుల్ స్టాప్ పడింది.