దట్ ఈజ్ నాగచైతన్య.. 10కోట్ల రూపాయల ఆఫర్ రిజెక్ట్..కారణం ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే డెసిషన్స్ వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది . ఇండస్ట్రీలో స్టార్ హీరో పొజిషన్ అందుకున్న తర్వాత మేకర్స్ కి ఏది ముఖాన్నే చెప్పలేం .. చెప్తే ఫీలవుతారు ఏమో చెప్పకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అన్న సందిగ్ధంలో ఉండాల్సి వస్తుంది . అయితే రీసెంట్ గా హీరో నాగచైతన్య చేసిన పని మాత్రం అభిమానులకు తెగ నచ్చేసింది . ఈ క్రమంలోనే నాగచైతన్య పేరుని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ .

ప్రెసెంట్ నాగచైతన్య కెరియర్ ఎంత డిజాస్టర్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ మధ్యకాలంలో ఆయన హిట్ కొట్టిందే లేదు. భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి . అయితే రీసెంట్గా బడా పాన్ ఇండియా స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ కోసం నాగచైతన్యను అప్రోచ్ అయ్యారట మేకర్స్ . అయితే నాగచైతన్య ఈ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేశారట. ఒక్కరోజుకి కోటి రూపాయలు ఇస్తామని పది రోజుల కాల్ షీత్స్ ఇస్తే మొత్తం సినిమా షూట్ కంప్లీట్ చేస్తామని చెప్పుకొచ్చారట .

అయినా సరే నాగచైతన్య ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. దానికి కారణం నాగచైతన్యకు గెస్ట్ రోల్ లో నటించడం ఇష్టం లేదట . గతంలో సమంత సినిమాలో అలా నటించాడు తప్పిస్తే ఆయనకు గెస్ట్ రోల్ నటించడం ఏమాత్రం ఇష్టం లేని కారణంగా 10 కోట్ల ఆఫర్ ని వదులుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!