“నువ్వు మంచోడు అని ప్రూవ్ చేసుకోవడానికి ఇలా చేయాలా నాని..?”..ఏకేస్తున్న జనాలు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మంచి కన్నా చెడుని ఫాస్ట్ గా తీసేసుకుంటున్నారు జనాలు. ప్రతి విషయానికి భూతద్దంలో పెట్టి చూడడం నానా రాద్ధాం. తాలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా కామన్ గా కనిపిస్తుంది . అలాంటి పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు నాచురల్ స్టార్ నాని . మనకు తెలిసిందే ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు ఏకంగా 10 నేషనల్ అవార్డులు వరించాయి.

బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ అవార్డు అందుకోగా 6 కేటగిరిలో ఆర్ఆర్ఆర్ అవార్డులు అందుకున్నింది. బెస్ట్ చిత్రంగా ఉప్పెన సినిమా కూడా సెలెక్ట్ అయింది . ఇలా మొత్తంగా 10 అవార్డులను ఈసారి తెలుగు సినిమా పరిశ్రమకు వరించాయి. ఇదే క్రమంలో నాని పోస్ట్ చేస్తూ “ఎవరైతే నేషనల్ అవార్డు గెలుచుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాట్యులేషన్స్ విషెస్ చెప్పారు”.

అంతేకాదు సూర్య నటించిన జై భీమ్ సినిమాకి నేషనల్ అవార్డు రాకపోవడంపై నాని హర్ట్ అయ్యాడు. ఇదే విషయాన్ని హాట్ బ్రోకెన్ సింబల్ పెడుతూ గుండె బద్దలైంది అంటూ చెప్పకనే చెప్పేసాడు. దీంతో సోషల్ మీడియాలో ఇదే పోస్ట్ వైరల్ గా మారింది. అయితే కొంతమంది నానిని పొగుడుతుంటే మరి కొంతమంది నానిని తిడుతున్నారు. నువ్వు మంచోడివి అని చెప్పుకోవడానికి ఇలా కూడా చేయాలా..? అంటూ ఘాటుగా రిప్లై ఇస్తున్నారు..!!