“ఆ మెగా హీరో ఒక్కడే జెన్యూన్ ” ..వైరల్ అవుతున్న బన్ని కామెంట్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ స్టైల్ స్టార్ హీరో అల్లుఅర్జున్ పేరే మారుమ్రోగి పోతుంది . దానికి కారణం రీసెంట్గా ఆయనకు జాతీయ అవార్డు వరించడం . ఆయన కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఏకంగా జాతీయ అవార్డు వరించింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ స్టార్ సెలబ్రిటీస్ అందరూ ఆయనకు స్పెషల్గా విషెస్ అందజేస్తున్నారు.

ఈ క్రమంలోనే కజిన్ సాయి ధరమ్ తేజ్ సైతం అల్లు అర్జున్ కు విష్ చేశారు . కాగా “ఈ అరుదైన ఘనత నువ్వు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బన్నీ ..ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు గెలుచుకున్నందుకు నా శుభాకాంక్షలు ..తొలి తెలుగు నటుడిగా ఆ ఘనత నీదే కంగ్రాట్స్ ..సూపర్ కంగ్రాట్స్ ” అంటూ సాయిధరమ్ తేజ్ పోస్ట్ చేశారు .

దీనికి బన్నీ రిప్లై ఇస్తూ ..”థాంక్యూ సో మచ్ స్వీటెస్ట్ జెన్యూన్ కజిన్ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే. సెలెబ్రిటీలు చేసే ప్రతి కామెంట్ ని బూతద్దంలో చూస్తుంటారు. ఇప్పుడు బన్నీ తేజుని మాత్రమే జెన్యూన్ కజిన్ అనడం పట్ల ఉహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇదే రిప్లై వైరల్ గా మారింది . సాయిధరమ్ తేజ్ జెన్యూన్ అయితే మిగతా హీరోలు మిగతా జనాలు చేసిన కామెంట్స్ ఏంటి బన్నీ అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . ఇదే విషయాన్ని ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!