ఉపాసన కి మామ అద్దిరిపోయే కౌంటర్.. మెగాస్టార్ నా మజాకా..!!

టాలీవుడ్ మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి నిన్న తన 68వ పుట్టినరోజులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు ఆయనకు కావాల్సిన వాళ్ళు.. మెగా ఫ్యాన్స్ ఆయనకు సోషల్ మీడియా ద్వారా బర్త డే విషెస్ చెప్పారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ వాళ్ళందరికీ రిప్లై ఇస్తూ వచ్చారు.

కాగా నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ – ఉపాసన తమ కూతురు ఫస్ట్ ఫోటోని రివీల్ చేశారు . అయితే ఆ ఫోటోలో పాప ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు . కానీ ఆ ఫోటోలో ఆమె పోలికలు సగం సగం గారి రీవిల్ అయ్యాయి. మొత్తం ఉపాసన లానే ఉంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి . ఇదే క్రమంలో ఉపాసన రాంచరణ్ ఇద్దరు ఒకే పోస్టులు వేస్తూ చరణ్ తండ్రికి ఉపాసన మామకి బర్త డే విషెస్ అందించారు.

“క్లింకార” విష్ చేస్తున్నట్లు “హ్యాపీ బర్త డే చిరుత చిరంజీవి తాత.. అంటూ మెన్షన్ చేశారు”. దీనికి చిరంజీవి రిప్లై ఇస్తూ ” మన జీవితాల్లోకి క్లీంకార రావడం ఈ బర్త్ డే నాకు మరింత విలువైనదిగా మారిపోయింది . చాలా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది . నా ఈ చిట్టి తల్లి రాకతో నాలో ఇంకా ఎనర్జీ పెరిగింది . యంగ్ గా మారాను అన్న ఫీలింగ్ వస్తుంది “అంటూ ఉపాసనకు కౌంటర్ వేస్తూ కామెంట్ చేశాడు చిరంజీవి .దీంతో ఇదే కామెంట్ వైరల్ గా మారింది..!!