విజయ్ దేవరకొండ-త్రిష కాంబో లో మిస్ అయిన ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.. !!

టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రజెంట్ చేస్తున్న మూవీ ఖుషి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటిస్తుంది . ఇప్పటికీ సినిమాకి సంబంధించిన టీజర్ – ట్రైలర్ – పాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి .

కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ త్రిష కాంబోలో రావాల్సిన సినిమా మిస్సైంది అన్న విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ సినిమా మరేదో కాదు గీతగోవిందం. పరశురాంపెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు .

ఈ సినిమాలో నిత్యామీనన్ స్పెషల్ పాత్రలో మెప్పించింది . అయితే ఈ పాత్ర కోసం మొదటగా త్రిష ను అప్రోచ్ అయ్యారట మేకర్స్ . కానీ త్రిష పాత్ర పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడంతో సున్నితంగా రిజెక్ట్ చేసిందట . అదే ఛాన్స్ నిత్యామీనన్ అందుకొని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది . మొత్తానికి అలా త్రిష చేయాల్సిన పాత్రను నిత్యామీనన్ తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయింది..!!