టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ ఎలాంటి రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ఉన్నాడో మనకు బాగా తెలిసిందే .కాగ ప్రజెంట్ పుష్ప 2 సినిమాతో సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నా అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం కన్ఫామ్ అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .
అంతేకాదు అల్లు అర్జున్ రేంజ్ ప్రజెంట్ మారిపోయింది. ఒక్క సినిమాకి 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . అయితే అలాంటి అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేవాడు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది . మొదటి నుంచి అల్లు అర్జున్ కి ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేయడం అంటే చాలా చాలా ఇష్టమట .
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి ఆనిమేటెడ్ డిజైనర్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేదట . ఈ టైంలోనే ఇండస్ట్రీలోకి హీరోగా రాకముందు అల్లు అర్జున్ ఇంటర్న ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేసాడట. దానికి గాను ఆయన 3500 శాలరీ కూడా అందుకున్నారట. అదే అల్లు అర్జున్ మొదటి సంపాదన. ఇదే విషయం అల్లు అర్జున్ స్వయంగా వెల్లడించడం గమనార్హం..!!