దేవర సినిమాలో ఎన్టీఆర్ కొడుకు.. నందమూరి ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునే న్యూస్ ఇది..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ దేవర . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ప్రెసెంట్ రెండో షెడ్యూల్ ని చక చక ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు దేవర టీం . ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా ద్వారా సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నారు తార్క్ అంటూ ధీమ వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ జాలర్లు లాగా కనిపించబోతున్నారట . సముద్రం చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . కాగ ఇదే క్రమంలో దేవర సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. దేవర సినిమాలో ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ అంటూ ప్రచారం జరుగుతుంది.

ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర కోసం తన చిన్న కొడుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నడట . తారక్ మొదట ఈ ప్రాజెక్టు ఓకే చేయకున్న ఫైనల్లీ కొరటాల శివ ఈ పాత్రకి ఎన్టీఆర్ కొడుకునే బలవంతంగా మరి ఎన్టీఆర్ ని ఒప్పించి ఈ ప్రాజెక్టును ఫైనలైజ్ చేసారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం ఎన్టీఆర్ అభిమానులకు పండగే పండగ అని చెప్పాలి . ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ వారసుల ఎంట్రీ ఉండబోతుందా అంటూ ఎదురుచూసిన వాళ్లకి ఇది మంచి కికిచ్చే న్యూస్ అని చెప్పాలి..!!