నటుడు భరత్ సినీ కెరియర్ ముగిసినట్టేనా.. కారణం అదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటులు మొదట చైల్డ్ యాక్టర్ గా మంచి క్రేజ్ ను అందుకొని ఆ తర్వాత నటుడుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో నటుడు భరత్ కూడా ఒకరు.. చైల్డ్ యాక్టర్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన భరత్ పెద్దయ్యాక పలు సినిమాలలో హీరోగా నటించిన సైడ్ క్యారెక్టర్లలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. చైల్డ్ యాక్టర్ గా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన భరత్ సినీ ఇండస్ట్రీలోకి నటుడుగా మంచి పొజిషన్లో ఉంటారని అభిమానులు భావించారు.

కానీ గతంలో అడపా దడపా సినిమాలలో నటించిన ఈ మధ్యకాలంలో అసలు ఏ సినిమాలో కూడా కనిపించడం లేదు.. వాస్తవానికి భరత నటించిన సినిమాలన్నీ కూడా ఈ మధ్య ఫ్లాప్ అయ్యాయి.. చిన్నప్పుడు ఏ టైమింగ్ తో అయితే కామెడీ చేసేవాడో ఇప్పుడు అదే టైమింగ్ తో కామెడీ మిస్సయింది అంటూ పలువురు నెటిజన్లు సైతం నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. అప్పట్లో వెంకీ, పోకిరి, రెడీ, దూసుకెళ్తా తదితర చిత్రాలలో నటుడుగా మంచి గుర్తింపు సంపాదించారు.

అయితే ఇప్పుడు భరత్ సినిమాలో లేకుండా ఖాళీగా ఉండటం నిజంగా అందరిని బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే గతంలో తను ఏదో డాక్టర్ కోర్సులు బిజీగా ఉన్నారని వార్తలు కూడా వినిపించాయి. మరి అవకాశాలు లేక భరత్ సైలెంట్ గా ఉన్నారా లేకపోతే తన డిగ్రీని పూర్తి చేయడానికి సినిమాలకు దూరంగా ఉన్నారా అనే విషయం మాత్రం ఇంకా సందిగ్ధంగానే ఉన్నది. మరి రాబోయే రోజుల్లో నైనా ఏదైనా సినిమాతో రీ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి మరి.