రష్మీ ని ఒకేసారి అంత మాట అనేసిన నాగార్జున కోడలు..!!

ఈ మధ్యకాలంలో ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరొక భాషలలో తెరకెక్కించి విడుదల చేస్తూ మంచి విజయాలు అందుకున్న చిత్రాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కన్నడ నుంచి ఎన్నో చిత్రాలు తెలుగులో కూడా డబ్ మంచి విజయాలను అందుకున్నాయి. ఇటీవల కన్నడలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం హాస్టల్ హుడుగూరు బేకాగిద్దరే.. ఈ సినిమా అక్కడ భారీ కలెక్షన్లను రాబట్టింది.. మొత్తం కొత్త వాళ్ళది తెరకెక్కించిన ఈ సినిమా అందరిని ఆకట్టుకున్నది.

ఈ చిత్రాన్ని రక్షిత్ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కూడా అన్నపూర్ణ స్టూడియోస్ చాయ్ బిస్కెట్ ఫిలిం వారు తెలుగులో అందిస్తున్నారు. దాదాపుగా 500 మందికి పైగా కొత్తవారితో ఈ సినిమాని తెరకెక్కించారు.. ఈ సినిమాని తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో విడుదల చేయబోతున్నారు.. ఇందులో యాంకర్ రష్మీ ,తరుణ్ భాస్కర్, రిశాబ్ శెట్టి లాంటివారు అతిథులుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగులో ఈ సినిమాని తీసుకున్నందుకుగాను తెలుగులో నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సుప్రియ (నాగార్జున మెన కోడలు) అనురాగ్ రెడ్డి తదితరులు సైతం ఒక ఈవెంట్ను నిర్వహించారు.

ఈవెంట్లో సుప్రియ మాట్లాడుతూ బాయ్స్ హాస్టల్ మూవీ కన్నడలో చూశానని చాలా బాగా నచ్చింది.. అందుకే తెలుగులో తెరకెక్కించాము ట్రైలర్ను కూడా చూశాము ఇందులో రష్మి చాలా హాట్ గా కనిపించింది.. హాట్ కేకుల ఉన్నావు అంటూ రష్మీ పైన ప్రశంసలు వర్షం కురిపించింది.. అయితే సుప్రియ అమ్మాయి కాబట్టి ఇలాంటి కామెంట్స్ చేసిన పర్వాలేదు కానీ అదే అబ్బాయిలు చేస్తే మాత్రం అసలు ఊరుకోనని అర్థం వచ్చేలా కూడా రష్మీ రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. సుప్రియ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.