మొన్న చిరు ఇప్పుడు బాలయ్య.. మరోసారి డైరెక్టర్లకి ఇచ్చి పడేసారుగా..!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలు నోరు జారి లేనిపోని వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ లో మాట్లాడుతూ అనుకోని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ వస్తున్నారు. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య అనుకోకుండా అక్కినేని- తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే.

Chiranjeevi - Balakrishna

అదేవిధంగా చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో మరో స్టార్ హీరో అయిన ర‌వితేజ‌ ను పొగడబోయి ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయన ఎలాంటి విమర్శలు అందుకున్నారో తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ విషయాలు మర్చిపోకముందే మరోసారి బాలకృష్ణ పాన్ ఇండియా సినిమాలపై కామెంట్లు చేశారు. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.

AP Nurses Serious And Protests Over Balakrishna Cotroversial Comments,  Details Inside - Sakshi

బాహుబలి, కే జి ఎఫ్, త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను అందరూ ఆదరిస్తున్నారు. ఇప్పుడు ప్రతి భాషలో అందరూ తమ సినిమాలను పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయం అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని మీడియం రేంజ్ సినిమాలో కూడా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అందుకున్నాయి.

Balakrishna tests positive for Covid-19 - News - IndiaGlitz.com

అలా వచ్చినవే కాంతార, కార్తికేయ-2 చిత్రాలు. సొంత భాష‌లో సూపర్ సక్సెస్ ని అందుకుంటే చాలు ఆ సినిమాల‌ని ఇతర భాషల్లో కూడా డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేస్తున్నారు మేకర్స్. ఈ క్క‌ర‌మంలోనే బాలకృష్ణ మరోసారి దర్శకులపై తనదైన రీతిలో కామెంట్లు చేశాడు. ఇక కంటెంట్ ఉన్న ప్రతి సినిమా కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమానీ అలాంటి ఒక మంచి సినిమా తెరకెక్కాలి అంటే హీరో దర్శకుడు నిర్మాత మధ్య మంచి సంబంధం ఉండాలి. అప్పుడే ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటారు. అలాకాకుండా నేను చెప్పిందే కథ‌ నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటే మంచి సినిమాలు రావు.

Chiranjeevi - Balakrishna Photos

ఈ సంక్రాంతికి వచ్చిన నా వీర సింహారెడ్డి సినిమాలో పెద్ద బాలకృష్ణ గెటప్ కి క‌న్న‌డాలో సూపర్ హిట్ అయిన శివరాజ్ కుమార్ మఫ్టీ మూవీలో గెటప్ అయితే బాగుంటుందని దర్శకుడికి చెప్పగా అది దర్శకుడు అర్థం చేసుకొని నాతో చేయించారు. ఇక అది సినిమా సక్సెస్ ఆవటంలో ముఖ్య పాత్ర పోషించింది అలాగే చిరంజీవి కూడా డైరెక్టర్లకు షాక్ ఇచ్చారు డైరెక్టర్లను ఇద్దరు హీరోలు ఒకేసారి ఇలా అనడంతో మరోసారి ఈ ఇష్యూ వైరల్ గా మారింది.