మిర్చి సినిమా షూటింగ్ లో ప్రభాస్ తో అంత పని చేసిన అనుష్క..కొరటాల షాక్..

ప్రభాస్- అనుష్క కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానులతో పాటు సగటు సినీ అభిమానుల్లో కూడా మంచి పూనకాలు వస్తాయి. ఎందుకంటే వీరి జోడి కి వెండితెరపై మంచి క్రేజ్ ఉంది. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ సూపర్ హిట్‌గా నిలిచాయి. వీరిద్దరి జంట హిట్ పెయిర్ గా కూడా టాక్‌ సంపాదించుకుంది. అలాంటి ఇద్దరి కాంబినేషన్లో బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఆ సినిమాలలో మిర్చి సినిమా వచ్చి దాదాపు దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మిర్చి సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వైరల్ గా మారింది. ఈ సినిమాను స్టార్ట్ దర్శకుడు కొరటాల శివ తన మొదటి సినిమాగా తెరకెక్కించాడు. ఇలా తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Watch Mirchi - Disney+ Hotstar

ఈ సినిమాలో వచ్చే “పండగల దిగివచ్చావు” అనే పాటలో ప్రభాస్ ని అనుష్క అమాంతం ఎత్తుకుంటుంది. ప్రభాస్ లాంటి ఆరు అడుగుల భారీ కట్ అవుట్ ను మోయాలంటే అంత సులభం కాదు. అయితే ఈ సన్నివేశం సినిమాకి ఎంతో అట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఈ సన్నివేశం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. ఆ టైంలో నేను ప్రభాస్ ని అమాంతం ఎత్తుకోలేదు.. ఓ స్టూల్ సహాయంతో స్టూల్ మీద ప్రభాస్ నిలబడ్డాక స్టూల్ పైనుంచి పైకి ఎత్తుకున్నాను అంటూ ఆ సీన్ పై క్లారిటీ ఇచ్చింది.

Anushka

ఏదేమైనాప్పటికీ ప్రభాస్ లాంటి ఆరడుగుల కట్ అవుట్ ను ఎత్తాలంటే హీరోయిన్లకు మామూలు విషయం కాదు. కానీ అనుష్క ఆ పని చేసి సినిమా షూటింగ్లో ఉన్న వారందరిని షాక్‌కు గురి చేసింది. అయితే వీరి కాంబినేషన్లో ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక వీరి జోడిని రియల్ జోడిగా మార్చుకోమని ఇప్పటికే ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు.