అక్షయ్ కుమార్ తో బ్రేకప్ పై పెదవి విప్పిన రవినా టాండన్..!!

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో బ్రేకప్ కావడంపై దాదాపుగా పాతికేళ్ల తర్వాత నటి రవీనా టాండన్.. స్పందించడం జరిగింది. అక్షయ్ కుమార్ తో వివాహం రద్దయిన ఆ క్షణాలు ఇప్పటికి తాను మర్చిపోలేకపోతున్నానని విషయాన్ని తెలియజేసింది. 1994 లో విడుదలైన మోహ్రా సినిమా కోసం అక్షయ్ నేను కలిసి పని చేసాము. ఆ సినిమా సూపర్ హిట్టు కావడంతో మా జోడి మంచి ప్రశంసలు అందుకుంది. మేమిద్దరం రిలేషన్ షిప్ లో రావడం..నిశ్చితార్థం జరగడం..ఆ వెంటనే బ్రేకప్ కూడా జరిగిపోయింది.

Raveena Tandon | అక్షయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌పై 25 ఏళ్ల తర్వాత  స్పందించిన రవీనా టాండన్‌
అతడి జీవితం నుంచి నేను బయటకి వచ్చేసాను అతడు వేరే అమ్మాయితో డేటింగ్.. నేను వేరే వ్యక్తితో రిలేషన్ లో వచ్చాను మా ఇద్దరి మధ్య ఎలాంటి అసూయ కూడా ఏర్పడలేదు. ఇప్పటికీ మేమంతా కలుస్తూనే ఉంటాము.. మాట్లాడుకుంటూనే ఉంటాము ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నామని తెలిపింది రవీనా టాండన్.. అయితే మా నిశ్చితార్థం ఎప్పుడు జరిగిందనేది నాకు సరిగ్గా గుర్తులేదు కానీ.. ఆ తరువాత జరిగిన పరిణామాలు మాత్రం ఇప్పటికి తన మనసులో అలాగే ఉండిపోయాయని తెలియజేసింది

Raveena Tandon opens up on her past relationship with Akshay Kumar

వాటిని ఎందుకు గుర్తుపెట్టుకున్నానో తెలియదు కానీ ఆ బ్రేకప్ కొంతకాలం పాటు తన మనసుని గాయపరచడంతో కొన్ని సంవత్సరాలు న్యూస్ పేపర్ ని కూడా చదవడం మానేశానని తెలిపింది రవీనా టాండన్.. దాదాపుగా పాతికేళ్ల తర్వాత అక్షయ్ కుమార్ తో బ్రేకప్ పై రవీనా టాండన్.. స్పందించడంతో ఒకసారిగా అభిమానులు షాక్కు గురవుతున్నారు. రవీనా టాండన్ బాగా పాపులర్ కావడానికి ముఖ్య కారణం కేజిఎఫ్ చిత్రంలో నటించడమే అని చెప్పవచ్చు. ఈ చిత్రం వల్ల ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది.