నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతున్నాడు. ఇక వచ్చే సంక్రాంతి కానుకగా తన 107వ సినిమా అయినా వీర సింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాను క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక సాంగ్ మినహా మిగిలిన సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన 108వ సినిమాను వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేయబోతున్నాడు. ఇక ఈరోజు ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు. ఇక ఈ సమయంలోనే బాలయ్య అభిమానులు అనిల్ రావుపూడి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య 108వ సినిమా నుండి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈరోజు విడుదల చేస్తారని అందరూ ఆశించారు. కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం పూజా కార్యక్రమాలతో సరిపెట్టారు. ఇక బాలయ్య 108వ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్న.. కానీ ఇప్పటివరకు షూటింగ్‌ను మొదలు పెట్టలేదు.
ఈరోజు నుంచి ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఇక రెగ్యులర్ షూటింగ్‌ను కూడా బ్రేక్ లేకుండా శరవేగంగా సినిమాను పూర్తి చేస్తామని దర్శకుడు అనిల్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే 108 వ సినిమాగా రాబోతుంది. ఈ సినిమాలో బాలకృష్ణను ఆయన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో కొత్తగా చూపించబోతున్నట్లు అనిల్ ఎంతో నమ్మకంగా చెప్పారు.ఈ సినిమాలో బాలయ్యకు జంటగా చాలా మంది హీరోయిన్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. రీసెంట్గా ఈ సినిమాలో బాలయ్యకు జంటగా ప్రియాంక జవాల్కర్ పేరు కూడా బయటకు వచ్చింది.
ఇక ఆమె హీరోయిన్గా సెట్ అయి ఉంటే ఈరోజు ఈ సినిమా పూజ కార్యక్రమాలకు వచ్చి ఉండేది. కానీ ఆమె ఈ కార్యక్రమంలో ఎక్కడ కనబడలేదు. ఈ విధంగా ఈమె కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందన్న వార్తలపై అనుమానాలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ 55 సంవత్సరాల ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయనకు కూతురుగా ఈ సినిమాలో పెళ్లి సందడి ఫ్రేమ్ శ్రీ లీల నటించబోతుంది. ఈ సినిమాతో బాలకృష్ణ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.