కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిషా.. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నిషా.. పెళ్లి చేసుకుని ఓ బాబు జన్మనిచ్చింది.
అయితే పెళ్లి అయిన ఇన్నేళ్లకు మళ్లీ నిషా అగర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఓటీటీ కంటెంట్ తో అని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్న ఈ భామ దగ్గుబాటి హీరోలు బంపర్ ఛాన్స్ ఇచ్చారట. పూర్తి వివారల్లోకి వెళ్తే..
వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ను హిందీతో తెరకెక్కించి.. ఇతర భాషల్లోని అనువాదం చేసి విడుదల చేస్తారట. అయితే ఈ సిరీస్‌లో ఓ కీలక పాత్ర కోసం నిషా అగర్వాల్‌ను తీసుకున్నారని.. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.