కాజ‌ల్ చెల్లి రీఎంట్రీ..బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన ద‌గ్గుబాటి హీరోలు?!

కాజ‌ల్ అగ‌ర్వాల్ చెల్లెలు నిషా అగ‌ర్వాల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిషా.. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ స‌క్సెస్ సాధించ‌లేక‌పోయింది. దాంతో సినిమాల‌కు గుడ్ బై చెప్పేసిన నిషా.. పెళ్లి చేసుకుని ఓ బాబు జ‌న్మ‌నిచ్చింది.

Kajal Aggarwal's Sister, Nisha Aggarwal Misses Her, Shares Real And Reel  Pictures Of Her Wedding

అయితే పెళ్లి అయిన ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ నిషా అగ‌ర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా ఓటీటీ కంటెంట్ తో అని తెలుస్తోంది. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయ‌బోతున్న ఈ భామ‌ ద‌గ్గుబాటి హీరోలు బంప‌ర్ ఛాన్స్ ఇచ్చార‌ట‌. పూర్తి వివార‌ల్లోకి వెళ్తే..

Venkatesh Daggubati on Rana, Aranya at Aranya Pre Release Event

వెంక‌టేశ్‌, రానా ద‌గ్గుబాటి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్‌లో న‌టించ‌బోతున్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ సిరీస్‌ను హిందీతో తెర‌కెక్కించి.. ఇత‌ర భాష‌ల్లోని అనువాదం చేసి విడుద‌ల చేస్తార‌ట‌. అయితే ఈ సిరీస్‌లో ఓ కీల‌క పాత్ర కోసం నిషా అగ‌ర్వాల్‌ను తీసుకున్నార‌ని.. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.