తిరువూరులో బాబు మార్క్ పంచాయితీ.. కొలిక‌పూడి సింగ‌ల్ టైం ఎమ్మెల్యే…!

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ రాజ‌కీయాలు గ‌త ఆరేడు నెల‌లుగా వేడెక్కిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు వ‌ర్సెస్ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ( చిన్ని ) మ‌ధ్య అంత‌ర్గ‌త వార్‌తో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు ర‌గిలిపోతున్నారు. ప్ర‌తి విష‌యంలో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న ఆధిప‌త్య పోరులో తిరువూరు టీడీపీ ప‌రువు రాష్ట్ర వ్యాప్తంగా ర‌చ్చ‌కెక్కి బ‌జారున ప‌డింది. తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలోని నెమ‌లి వేణుగోపాల స్వామి ఆల‌య ఉత్స‌వాల నేప‌థ్యంలో మ‌రోసారి ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌తో అస‌లు ఈ ఇష్యూకు ఎండ్ కార్డ్ ప‌డుతుందా ? అన్న సందేహాలు వ‌చ్చాయి. అయితే తిరువూరు ఇష్యూకు చంద్ర‌బాబు త‌న‌దైన స్టైల్ పంచాయితీతో చెక్ పెట్టేశారు. మ‌రి ఆ పంచాయితీ ఏంటి … ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేష‌ణ లింక్ క్లిక్ చేసి వినండి.