ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాత సినిమాల టైటిల్స్‌ను.. అలాగే సాంగ్స్‌ను వాడుకోవడం ట్రెండింగ్‌గా మారింది. ఈ క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు సైతం పాత సినిమాల నుంచి పలు ఇంట్రెస్టింగ్ హిట్ సాంగ్స్‌ను రీమేక్ చేస్తూ.. తమ సినిమాల్లో వాడుకుంటున్నారు. అయితే.. రామ్ చరణ్ కూడా ఇదే బాటలో ప్రయాణిస్తున్నాడంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది. చరణ్ ఇప్పటికే తన తండ్రి, బాబాయ్ సినిమాల్లోని పలు టైటిల్, సాంగ్స్ ను తన సినిమాల కోసం వాడుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా చరణ్ పెద్ది సినిమాకోసం బాబాయ్ పవన్ కెరీర్‌లోనే వన్ అఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సాంగ్ తన సినిమాలో రీమేక్ చేయబోతున్నాడట. ఆ పాట ఏంటంటే.. ఖుషిలో అమ్మాయి సన్నగా సాంగ్. ఈ పాటను రీమేక్ చేసి పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ క్రియేట్ చేయబోతున్నారని టాక్. దీనికి సంబంధించిన లీగల్ రైట్స్.. అలాగే అన్ని విషయాలను మూవీ టీం కన్ఫర్మ్ చేసుకున్నారని.. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం.
చరణ్ స్వయంగా బుచ్చిబాబుకు ఈ సజెషన్ ఇచ్చాడని.. బాబాయ్ సినిమాలోని ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ రీమేక్ చేద్దామంటూ అతనికి వివరించాడని.. టైమింగ్ రైమింగ్ కూడా కలిసి రావడంతో బుచ్చిబాబు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ టాక్. ఇప్పుడు తమ సినిమాలో ఈ సాంగ్ రీమేక్ చేయబోతున్నారని.. కచ్చితంగా సినిమా చూసిన తర్వాత ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా ఇంట్రెస్టింగ్ లెవెల్ లో ఈ రీమేక్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో మెగా ఫ్యాన్స్ ఆనందని వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా బుచ్చిబాబు హిట్ కొట్టేసినట్టే అంటూ కామెంట్లు చేస్తున్నారు.