ఆపరేషన్ సింధూర్: వార్ టైంలో వెకేషన్ కు తారక్ .. వీడియో వైరల్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూట్ లో ఫుల్ బిజీగా గడుపుతున్న తారక.. ఏప్రిల్ 22న రెండ‌వ‌ స్కెడ్యూలను ప్రారంభించాడు. అయితే ఈ స్కెడ్యూల్ లో పాల్గొన్న తారక్.. నిన్నటి వరకు బ్రేక్ లేకుండా షూటింగ్లో సందడి చేశాడు. కాగా.. ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తయిన క్ర‌మంలో బ్రేక్ తీసుకొని.. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసాడు. దీనికి సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లడం పై సోషల్ మీడియాలో సర్వాత్ర విమర్శలు మొదలయ్యాయి. రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

India vs Pakistan: Who Will the World Support in a War | Dynamite News

భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న క్రమంలో.. భారత్ లో ఉండడం ప్రస్తుతానికి సురక్షితం కాదని.. అందుకే పరిస్థితులు సర్దుకునే వరకు సమ్మర్ ట్రిప్‌కి వెళ్లడం మంచిదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ ఆలోచన ఎలా ఉన్నా.. ఆయన లాంటి ఓ మాస్ ఇమేజ్ క్రియేట్ అయిన స్టార్ హీరో.. ఏ పని చేసిన నేటిజెన్లు భూతద్దంలో చూస్తూ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం సర్వసాధారణం. కాగా.. ఎన్టీఆర్ క్యాజువల్ గానే తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళుతున్నాడనేది నిజం. ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. తాజాగా హృతిక్ రోషన్‌తో కలిసి.. వార్ 2 సినిమాను పూర్తి చేశాడు. ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ కానుంది.

NTR : ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి చెక్కేసిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్  సినిమాకు బ్రేక్.. | Ntr wents to vacation with family and friends prasanth  neel movie gets summer break sy-10TV Telugu

అయితే ఈ సినిమాలో తారక్ నెగటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడని సమాచారం. కానీ.. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా అఫీషియల్ గా ప్రకటించలేదు. ఈ క్రమంలోనే మూవీ టీం నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటూ టీం ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే వాట్ 2 రిలీజ్ అవుతున్న.. ఆగస్టు 14న కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్‌ కాంబినేషన్లో కూలీ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే రెండు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు ఒకే రోజున రిలీజ్ అవ్వడం అంటే అది అసాధారణమని.. వార్ 2 వెనక్కి తగ్గే అవకాశం ఉందంటూ టాక్ నడుస్తుంది. కనీసం మే 20న‌ ఫస్ట్ లుక్ తో అయినా దీనిపై క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.