టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ముంబై వేదికగా జరిగిన వేవ్స్ మీట్లో సందడి చేశారు. ఆయన ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. తనలో స్ఫూర్తి నింపిన భారతీయ సినీ నటులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక్కో విషయంలో ఒక్కొక్కరు నన్ను ఇన్స్పైర్ చేశారంటూ చెప్పుకోచ్చాడు మెగాస్టార్. తన సినీ ప్రయాణాన్ని.. మరోసారి గుర్తు చేసుకున్నాడు. నా చిన్నతనంలో నేను డ్యాన్స్‌తో ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని ఎంటర్టైన్ చేసేవాడిని. అలా.. నటనపై మొదలైన ఇంట్రెస్ట్ నన్ను చెన్నై వరకు వెళ్లేలా చేసింది. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయానికి ఎంతోమంది లెజెండ్రి యాక్టర్లు ఉన్నారు.
పలువురు సూపర్ స్టార్స్ సైతం ఉన్నారు.. అంటూ వివరించాడు. ఇక అప్పటికే అంతమంది స్టార్ సెలబ్రిటీస్ ఉండగా.. ఇంక నేను అదనంగా ఏం చేయగలను అని అనుకునేవాడిని.. కానీ ఎలాగైనా అందరి దృష్టి ఆకర్షించాలని భావించా. దాన్ని నేను లక్ష్యంగా పెట్టుకున్న. 1977లో నటనలో శిక్షణ తీసుకున్నా. మేకప్ లేకుండా నాచురల్ నాటనతో ఎంటర్టైన్ చేయడం మిథున్ చక్రవర్తి నుంచి నేను నేర్చుకున్నా. స్టాంట్ప్ విషయంలో అమితాబచ్చన్, డ్యాన్స్ విషయంలో నా సీనియర్ కమల్ హాసన్ గారు నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్.
వారి సినిమాలు చూస్తూ నటన పరిశీలిస్తూ నన్ను నేను మలుచుకున్నా అంటూ వివరించాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో భారత్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చాలని లక్ష్యంతో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్). గురువారం చాలా గ్రాండ్ లెవెల్లో ప్రారంభమైంది. ఈ వేడుకలు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. అడ్వైజరీ బోర్డులో చిరంజీవితోపాటు.. మరి కొంతమంది స్టార్ సెలబ్రిటీ సభ్యులుగా వ్యవహరించారు. రజినీకాంత్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.