సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోల తమ వరకు వచ్చిన కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. స్టోరీ నచ్చక కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తే.. డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా.. మరేfy కారణాలతో కొన్ని సినిమాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే.. కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించి కొంత స్కెడ్యూల్ పూర్తయిన తర్వాత కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోను కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించిన తర్వాత రకరకాల కారణాలతో ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి.
ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. పవన్ జానీ సినిమా తర్వాత తన స్వీయడైరెక్షన్లో సినిమా నటించాలని అనుకున్నాడు. దాన్ని సత్యాగ్రహి టైటిల్‌తో ఫిక్స్ చేశాడు. ఆ టైటిల్ సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొల్పింది. కానీ.. జానీ సినిమా ఫ్లాప్ తో ఈ సినిమాపై ఇంపాక్ట్ పడింది. దీంతో పవన్ ఈ ప్రాజెక్టును ఆపేసాడు. దేశభక్తి నేపథ్యంలో కూడా పవర్ స్టార్ దేశి పేరిట ఓ సినిమా నటించాలనుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి.
కానీ.. సినిమా సెట్స్ పైకి రాకముందే ఆగిపోయింది. సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్లో పవన్.. ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే సినిమాను నటించాలనుకున్నాడు. ఏసుక్రీస్తు చరిత్ర ఆధారంగా ప్రారంభించిన ఈ సినిమా షూట్ కొంత భాగం పూర్తయిన తర్వాత ఆపేయాల్సి వచ్చింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబోలోను ఓ సోషియా ఫాంటసీ డ్రామా ప్లాన్ చేశారు. సినిమా సెట్స్‌పైకి వచ్చాక ఆగిపోయింది. ఇదే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి అరవింద సమేత సినిమా చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.